వీడియో తీసి బ్లాక్ మెయిల్.. పలుమార్లు శృంగారం.. చివరికి..

Wed Jul 15 2020 17:45:52 GMT+0530 (IST)

Take a video while bathing and repeatedly have Romance

మహిళలను లోబరుచుకునేందుకు కొందరు అక్రమార్కులు దారుణాలకు పాల్పడుతున్నారు. రహస్య కెమెరాలతో స్నానం చేస్తుండగా వీడియో తీసి వాటితో వారిని బ్లాక్ మెయిల్ చేసి తనివితీరా అనుభవిస్తున్నారు. చివరికి వేధింపులు భరించలేక మహిళలు ఉసురుపోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.తాజాగా కర్ణాటకలోని బళ్లారిలో అంజి అనే వ్యక్తి భార్య స్నానం చేస్తుండగా.. అదే ప్రాంతానికి చెందిన మధు రహస్య కెమెరాతో వీడియో తీశాడు. అది ఆమెకు చూపించి తనతో శృంగారానికి ఒప్పుకోకపోతే వీడియో బయటపెడుతానని.. నీ పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో మధు చెప్పినదానికి మహిళ ఒప్పుకుంది.

నెలరోజులుగా రోజూ భర్త అంజి ఇంట్లో లేని సమయంలో మధు వస్తూ భార్యను బెదిరిస్తూ లోబరుచుకుంటున్నాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి మరోసారి శృంగారంలో పాల్గొంటున్నాడు. గత వారం ఇక చాలన్న మహిళను బెదిరించాడు.. నిన్ను నీ భర్తను చంపేస్తానంటూ అనుభవించాడు.

దీంతో విసిగి వేసారిన ఆ మహిళ జరిగిన దారుణాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.ఆస్పత్రికి తరలించినా బతకలేదు.

దీంతో మధుపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.