Begin typing your search above and press return to search.

ముగిసిన టీఎస్ ఆర్టీసీ సమ్మె..కండిషన్స్ అప్లై..

By:  Tupaki Desk   |   20 Nov 2019 12:12 PM GMT
ముగిసిన టీఎస్ ఆర్టీసీ సమ్మె..కండిషన్స్ అప్లై..
X
తెలంగాణ లో గత 47 రోజులుగా ఉదృతంగా సాగినా టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె కి నేటితో తెరపడింది. కానీ , దేనికోసమైతే కార్మికులు సమ్మె బాట పట్టారో ..అందులో ఏ ఒక్క డిమాండ్ కూడా నిరవేరకుండానే సమ్మెని ముగిస్తుండటం కొసమెరుపు. గత 47 రోజులుగా సమ్మె కొనసాగుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం - అటు కోర్టుల్లోనూ చుక్కెదురవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై కార్మిక సంఘాల నేతలు మల్లగుల్లాలు పడ్డారు. కేసు లేబర్‌ కోర్టుకు చేరడం, డిమాండ్లకు సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగింపు విషయంలో కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు మంగళవారం విడివిడిగా కార్మికుల అభిప్రాయాలు సేకరించాయి.

ఈ అభిప్రాయాలపై నేడు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి ఇతర కీలక నేతలతో కలిసి చర్చించారు. అలాగే హైకోర్టు నుంచి అందిన తుది ఉత్తర్వు ప్రతిని పూర్తిగా పరిశీలించి న్యాయవాదులతో కూడా చర్చలు జరిపారు. ఆ తరువాత ఈ సమ్మె పై జేఏసీ నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మెకు ఫుల్‌ స్టాప్ పెడుతున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే కార్మికులను ఎలాంటీ షరతులు లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. విధుల్లోకి తీసుకున్న కార్మికులు ఎలాంటీ షరతులపై సంతకాలు పెట్టరని స్పష్టం చేశారు. కేవలం డ్యూటిఫాం మీద మాత్రమే సంతకం చేస్తామని చెప్పారు. హైకోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నామని, ప్రభుత్వం కూడా కోర్టు తీర్పును గౌరవిస్తుందని ఆశిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. దీనిపై ఇంకా ప్రభుత్వం స్పదించలేదు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన రెండు అవకాశాలని ఉపయోగించుకోలేదు. దీనితో ఈ సమ్మె ముగింపు పై సీఎం కేసీఆర్ ఏంచెప్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...