అక్కడే ఏం చేయలేక ... పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే !

Sat Nov 21 2020 21:40:47 GMT+0530 (IST)

What can not be done there ... TRS MLA who satires on Pawan Kalyan!

గ్రేటర్ వార్ మొదలైన క్షణం నుండి ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధం ప్రారంభించారు. ఈ తరుణంలోనే న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై టీఆర్ ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గ్రేటర్ లో తొలుత సొంతగా పోటీచేస్తామన్న జనసేన ఆ తర్వాత బీజేపీ కి మద్దతుగా నిలిచింది. దీనిపై ఎమ్మెల్యే బాల్క సుమన్ పరోక్షంగా సెటైర్లు వేశారు. పక్క రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పోటీకి దిగుతాననడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అలాగే అక్కడ ఆ పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో లేడని అలాంటి పార్టీని వ్యక్తిని బీజేపీ కలుపుకోవడంవిడ్డూరమని అన్నారు. ఆ పార్టీ మాటలు వింటుంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ఈ రోజు నుండి మంత్రి కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయి. టీఆర్ ఎస్ పార్టీ ఎన్నిలకను ప్రశాంతంగా నిర్వహిస్తోంది. రేపు హైదరాబాద్ ను ప్రశాంతంగా ఉంచే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. మా అభ్యర్థుల్లో 50 శాతం విద్యావంతులు 50 శాతం యువకులు ఉన్నారు. 70 శాతం కంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది. టికెట్ల కేటాయింపులో టీఆర్ ఎస్ సామాజిక న్యాయం పాటించిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. బీజేపీలో గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొస్తానన్న బీజేపీ ఎంపీ.. ఆ పని చేశారా అని ప్రశ్నించారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్న కిషన్‌రెడ్డి నిస్సహాయుడని బాల్క సుమన్ విమర్శించారు. గ్రేటర్ లో మరోసారి టిఆర్ ఎస్ బంపర్ మెజారిటీ తో గెలుస్తుంది అని అయన ధీమా వ్యక్తం చేసారు.