టీఆర్ఎస్ నే గెలుస్తుందట.. జగ్గారెడ్డి జోస్యం!

Tue Nov 29 2022 16:01:25 GMT+0530 (India Standard Time)

TRS will win.. Jaggareddy's prediction

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లోపల ఏం ఉంచుకోకుండా కుండబద్దలు కొడుతూ మాట్లాడేస్తాడు. అందుకే ఆయనతో ఎవరూ పెట్టుకోరు. నోట్లో నోరు పెట్టరు. ఇటీవల వైఎస్ షర్మిల విమర్శిస్తే వారింట్లో జరిగిన లూప్ హోల్స్ అన్నింటిని బయటపెట్టి జగ్గారెడ్డి షాకిచ్చాడు.  ఇక  కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ నే తిట్టే మహానేతగా పేరుగాంచాడు. సొంత పార్టీలోనే అసమ్మతి రాజేస్తాడు.తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి బాంబు పేల్చాడు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ గెలవదని.. నంబర్ 2లోకి దిగజారుతుందని తెలిపారు. మరోసారి టీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ సీఎం అవుతాడని కుండబద్దలు కొట్టాడు.

తెలంగాణలో బీజేపీ చేస్తున్న హైటెక్ డ్రామాలకు ఓట్లు రాలవని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళితే అధికార టీఆర్ఎస్ మొదటి స్థానంలో .. కాంగ్రెస్ రెండో స్తానంలో ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ లో సమిష్టి నిర్ణయాలు జరుగుతున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పడం సరికాదని.. ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించాడు.

కాంగ్రెస్ సమావేశాల్లో రేవంత్ రెడ్డి తీరుపై ప్రస్తావిస్తానని జగ్గారెడ్డి అన్నారు. ఎన్నికల వరకూ రేవంత్ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేశారు. రేవంత్ మీడియాకు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారో అడుగుతానని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి అధిష్టానం అనుమతితో పాదయాత్ర చేసినట్లు అయితే తనతోపాటు అందరం సహకరిస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ పాదయాత్ర చేసి కష్టపడితే పూర్తిగా సహకరిస్తానని.. ఆయనతో కలిసి నడవడానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. సొంత ఏజెండా కాకుండా అందరినీ కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.