మునుగోడులో పోటీచేసేది టీఆర్ఎస్సేనా ?

Sat Oct 01 2022 12:41:53 GMT+0530 (India Standard Time)

TRS contesting in Munugoda?

ఇపుడిదే విషయమై అధికార పార్టీలో చర్చ బాగా జోరుగా జరుగుతోంది. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పోటీచేయకపోవటం ఏమిటి ? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడే ఒక సాంకేతిక అంశం ఉందని అధికార పార్టీ నేతల మధ్యే చర్చ జరుగుతోంది.ఇంతకీ ఆ పాయింట్ ఏమిటంటే ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను తొందరలోనే జాతీయ పార్టీగా కేసీయార్ ప్రకటించబోతున్నారు. ప్రకటించటమంటే ఏదో నోటిమాటగా చెప్పటం కాదు. మీడియాకు జనాలకు తెలిసేందుకు ప్రకటించటం వరకు ఓకే.

కానీ టెక్నికల్ గా జాతీయ పార్టీ అంటే కేంద్ర ఎన్నికల కమీషన్ నియమ నిబంధనల్లో ఫిట్ అవ్వాలి. అలాకాకపోతే పేరుకు మాత్రమే జాతీయ పార్టీగా మిగిలిపోతుందంతే. సరే విషయం ఏమిటంటే ఇప్పటివరకు ప్రాంతీయపార్టీగా ఉన్న  టీఆర్ఎస్ ను అక్టోబర్ 5వ తేదీన జాతీయ పార్టీగా ప్రకటించబోతున్నారట. మరి మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయబోయే అభ్యర్ధి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటారా ? లేకపోతే జాతీయ పార్టీ అభ్యర్ధవుతారా ?

జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత ఇక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ఉనికిలోనే ఉండదు. అలాగని టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా ప్రకటించినంత మాత్రాన అది వెంటనే జాతీయ పార్టీగా కూడా మారిపోదు. మరీ సాంకేతిక సమస్యకు పరిష్కారం చెప్పాల్సింది కేంద్ర ఎన్నికల కమీషన్ మాత్రమే.

ఇపుడు టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు. రేపు జాతీయ పార్టీగా మార్చిన తర్వాత కూడా పార్టీపేరు ఎన్నికల గుర్తు ఏముంటందో ఎవరికీ తెలీదు. దాన్ని డిసైడ్ చేయాల్సింది ఎన్నికల కమీషన్ మాత్రమే.

మరీ నేపధ్యంలో అధికార పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థి ఏ పార్టీ తరపున పోటీచేయబోతారు ? సదరు అభ్యర్థి ఎన్నికల గుర్తు ఏమిటి ? అనేది కాస్త అయోమయంగానే ఉంది. ఉపఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఎవరికీ తెలీదు. నవంబర్లో జరగచ్చనే ప్రచారం జరుగుతున్నది. మరి నేతల్లోని అయోమయానికి తెరపడేది ఎప్పుడో ?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.