Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ట్రాక్ మార్చిన టీఆర్ఎస్

By:  Tupaki Desk   |   27 Oct 2021 6:43 AM GMT
హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ట్రాక్ మార్చిన టీఆర్ఎస్
X
అందరూ ఎంతో ఆసక్తి గా చూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చింది. తెలంగాణ రాజకీయాల్ని అమితంగా ప్రభావితం చేయటమే కాదు..కొత్త సమీకరణాల కు తెర తీస్తుందని చెబుతున్న ఈ ఉప పోరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరం గా మారింది. అందరూ ఎంతో ఉత్కంఠ తో తుది ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలం లో జరిగిన ఉప ఎన్నికల్లో అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక గా హుజూరాబాద్ ను అభివర్ణిస్తున్నారు. ఈ ఉప పోరు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకం గా ఒక సంచలన పథకాన్ని తెర మీద కు తీసుకురావటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉప ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఈటలను టార్గెట్ చేస్తూ.. ఆయన అవినీతి.. భూకబ్జాల మీద నే టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కువ గా ఫోకస్ చేశారు. ఏ మాత్రం అవకాశం లభించినా..వ్యక్తిగత విమర్శలు చేయటాని కి వెనుకాడలేదు. ఉద్యమ సమయం లోనూ ఆ తర్వాత ఈటలను ఆకాశానికి ఎత్తేసిన వారు సైతం దారుణ రీతి లో వ్యాఖ్యలు చేశారన్న విమర్శ వినిపించింది.

మొన్నటి వరకు వీరుడు.. శూరుడు అని పొగిడిన వారంతా దారుణం గా తిట్టేస్తున్న వైనం తో అధికార టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న విషయాన్ని కాస్త ఆలస్యం గా గుర్తించినట్లు చెబుతున్నారు. ఈటల మీద తాము చేస్తున్న విమర్శలు.. ఆయన కు లాభం చేకూరుతున్నట్లుగా.. ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతున్నట్లు గా గుర్తించిన గులాబీ నేతలు గడిచిన నాలుగైదు రోజులు గా తమ ప్రచార స్టైల్ ను మార్చేసినట్లు చెబుతున్నారు. గతాని కి భిన్నంగా ఇటీవల కాలం లో ఈటల మీద కన్నా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మీదన ఎక్కువ గా ఫోకస్ చేస్తున్నారు.

పెట్రోల్.. డీజిల్ ధరల తో పాటు గ్యాస్ బండ ధరలు పెరగటాని కి కారణం బీజేపీ నేనని.. అలాంటి పార్టీ ని ఎన్నుకుంటారా? ఓటు వేస్తారా? అంటూ కొత్త పల్లవి ని అందుకున్నట్లు గా చెబుతున్నారు. గడిచిన మూడు రోజుల మంత్రి హరీశ్ ప్రచార సరళిని పరిశీలించినా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. గతం లో ఈటలను 90 శాతం లక్ష్యం గా చేసుకుంటే ఇప్పుడు మాత్రం 10 నుంచి 15 శాతం కంటే తక్కువగా నే టార్గెట్ చేసి.. విమర్శలు చేస్తున్నట్లు గా చెబుతున్నారు. మరి..ఈ ప్రచార వ్యూహం టీఆర్ఎస్ కు మేలు చేస్తుందా? అన్నది తుది ఫలితం వెల్లడయ్యాక మాత్రమే తేలుతుందని చెప్పా లి.