టీఆర్ఎస్ దెబ్బ: జోకర్ గా మారిన బీజేపీ..?

Thu Apr 22 2021 18:00:01 GMT+0530 (IST)

TRS blow: BJP turned joker?

దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాస్త విరామం తీసుకున్న టీఆర్ఎస్ ఆ తరువాత దూకుడు పెంచింది. ప్రతీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గులాబీ జెండా ఎగురేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఎమ్మెల్సీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తన ప్రతాపాన్ని చూపిన కారు పార్టీ వార్డుల ఎన్నికల్లోనూ ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుడా అడుగులు ముందుకేస్తోంది. తాజాగా జడ్చర్లలో టీఆర్ఎస్ ఆడిన గేమ్ తో బీజేపీ  జోకర్ గా మారింది.  బీజేపీకి ఏమాత్రం ఆలోచించుకోని టైం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా కదిలింది. కమలం నాయకులను ఖంగుతినిపించింది.మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణంలో తొలిసారి మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రావడంతో ఇక్కడ ఎన్నికల వాతావరణం ఏర్పడింది.  ఈనెలాఖరు వరకు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రస్ బీజేపీలు రంగంలోకి దిగనున్నాయి. అయితే బీజేపీకి జడ్చర్లలోని 27 వార్డుల్లో 15 స్థానాల్లో మాత్రమే పరోక్షంగా పోటీ చేస్తుందని తెలుస్తోంది.  అయితే ఇది గ్రహించిన  టీఆర్ఎస్ అందరికంటే ముందే అందరు అభ్యర్థులకు భీఫాంలను అందించింది.

ఇదిలా ఉండగా బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు బీజేపీతోపాటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురు బీజేపీ అభ్యర్థులను కూడగట్టుకొని టీఆర్ఎస్ లోకి ఆయన జంప్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అటు టీఆర్ఎస్ తమ అభ్యర్థి ఎవరనేది చివరి వరకు తెలియకుండా అక్కడ జాగ్రత్త పడింది. చివరి నిమిషంలో భీఫాంలు అందజేసి బరిలో నిలిపి అభ్యర్థులను కాపాడుకుంది.

బీజేపీ మాత్రం ముందుగా పలు అభ్యర్థులతో డమ్మీ నామినేషన్లు వేయించింది.  టీఆర్ఎస్ ఇందులో కొందరిని ముందే లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడితో మాట్లాడి తన తరుపున గెలిచే అభ్యర్థులతో టీఆర్ఎస్ లోకి చేరేలా ఒప్పందం చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో మరోసారి బీజేపీకి ఇక్కడ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇక టీఆర్ఎస్ ఆడిన ఈ ఆటలో బీజేపీ జోకర్ గా మిగిలిందని అనుకుంటున్నారు.