Begin typing your search above and press return to search.

అబ‌ద్ధం-అర్వింద్‌.. పాలు తేనె.. విడ‌దీసి చూడ‌లేం: క‌విత కామెంట్స్‌

By:  Tupaki Desk   |   22 May 2022 3:31 AM GMT
అబ‌ద్ధం-అర్వింద్‌.. పాలు తేనె..  విడ‌దీసి చూడ‌లేం:  క‌విత కామెంట్స్‌
X
బీజేపీ నాయ‌కుడు, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌పై సీఎం కేసీఆర్ గారాల‌ప‌ట్టి, ఎమ్మెల్సీ క‌విత సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ``అబ‌ద్ధం-అర్వింద్‌.. పాలు తేనె మాదిరిగా క‌లిసిపోయి ఉంటారు. ఆయ‌న చెప్పేవి అన్నీ అబ‌ద్ధాలే. విడ‌దీసి చూడ‌లేం`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందుకే టీఆర్ ఎస్‌ హయాంలో జరిగిన ప్రగతిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఆమె సూచించారు.

అబద్ధానికి ప్రతిరూపం ఎంపీ అర్వింద్ అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నిజామాబాద్‌ ఎంపీగా అర్వింద్‌ నియోజకవర్గ ప్రజలకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. ఎక్కడికి వెళ్లినా తాను ఎంపీగా ఉన్న‌ప్పుడు చేసిన అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కోరుట్ల నియోజకవర్గ టీఆర్ ఎస్‌ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కవిత.. విపక్ష నేతలపై విమర్శలు చేశారు.

పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేసి గద్దెనెక్కిన అర్వింద్ .. పసుపు రైతులను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి మరచి అన్నింటికి ధరలను పెంచడంపై దృష్టి సారించిందని కవిత పేర్కొన్నారు . మరోపక్క జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎప్పుడు చూసినా.. టీఆర్ ఎస్ పైన, కేసిఆర్ పైనే విమర్శలు చేస్తారన్నారు. ఆయనకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు కనపడటం లేదా.. లేక వారితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రతి కార్యకర్త టీఆర్ ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

క‌విత‌క్క స‌వాల్‌!!

``రూపాయి విలువ ఎన్నడూ లేనంత కనిష్ఠానికి పడిపోయింది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఎక్కడ ఉన్నవి ఉద్యోగాలు. మన తెలంగాణకు ఒక్క ఐఐటీ ఇచ్చారా..? ఈ విషయాల గురించి గ్రామాల్లో చర్చించాలి. కాంగ్రెస్ వారు రచ్చబండ పేరుతో గ్రామల్లోకి వస్తే వారికి ప్రగతి పార్క్లు.. అభివృద్ధి పనులను చూపించండి`` అని క‌వితక్క స‌వాల్ చేశారు.