Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ - వైసీపీ ఆదాయం - ఖర్చెంతో తెలుసా?

By:  Tupaki Desk   |   18 Jan 2020 6:10 AM GMT
టీఆర్ ఎస్ - వైసీపీ ఆదాయం - ఖర్చెంతో తెలుసా?
X
అధికారంలో ఉన్న పార్టీలకే ఆదాయం వస్తుంటుంది. ప్రభుత్వం కొనసాగిస్తుండడంతో వారి ద్వారా ఏదైనా లబ్ధి చేకూరుతుందని పారిశ్రామికవర్గాలు - బడా బాబులు - రాజకీయ నేతలు పార్టీలకు విరాళాలు ఇస్తుంటారు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీకి - రాష్ట్రంలో టీఆర్ ఎస్ - వైసీపీలకు ఆదాయం నిండుగా ఉంది.. వాళ్ల ఖజానా నిండుతోంది.

తాజాగా ఎన్నికల సంఘానికి దేశవ్యాప్తంగా ఉన్న 22 ప్రాంతీయ పార్టీలు - 6 జాతీయ పార్టీల ఆదాయ - వ్యయ వివరాలను సమర్పించాయి. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే దక్షిణాదిలో ఆదాయంలో తెలుగు రాష్టాల్లో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ - వైసీపీలు మొదటి రెండు స్థానాల్లో ఉండడం విశేషం.

గత ఆర్థిక సంవత్సరంలో టీఆర్ ఎస్ మొత్తం ఆదాయం రూ.188కోట్లుగా తన అఫిడవిట్ లో పేర్కొంది. ఇక ఎన్నికల ప్రచారం.. ఇతర ఖర్చుగా రూ.29.72 కోట్లు చూపించింది.

ఇక వైసీపీ మొత్తం ఆదాయాన్ని 181 కోట్లుగా చూపించింది. అయితే దక్షిణ భారత్ లోనే అత్యధిక ఖర్చు చేసిన పార్టీగా వైసీపీ నిలిచింది. ఏకంగా 2018-19లో 87.68 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం.

గత ఏడాదితో పోల్చితే అధికారంలోకి రావడంతో టీఆర్ ఎస్ - వైసీపీల ఆదాయాలు ఘననీయంగా భారీగా పెరగడం విశేషం. వీరి తర్వాత ఆదాయంలో జేడీఎస్ రూ.42.89 కోట్లు - ఏఐడీఎంకే రూ.28.10 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.