Begin typing your search above and press return to search.

టీడీపీ అధికారంలోకి ఖాయం.. రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   27 Jun 2022 6:32 AM GMT
టీడీపీ అధికారంలోకి ఖాయం.. రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు
X
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం హాట్ కామెంట్స్ చేశారు.

రోజురోజుకు ప్రజల్లో టీడీపికి ఆదరణ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారం చేపట్టడం తథ్యమని జోస్యం చెప్పారు. టీడీపీ కార్యకర్తలు ఇదే ఉత్సాహం కొనసాగించాలని సూచించారు.

రాఘవేంద్రరావు తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. ఆ పార్టీ కోసం యాడ్స్ కూడా రూపొందించారు. టాలీవుడ్ తోనూ టీడీపీకి సన్నిహిత సంబంధాలు ఉండేలా చూసుకున్నారు. టీడీపీలో ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ గానూ నియామకం అయ్యారు. అప్పటికే టీటీడీ బోర్డు చైర్మన్ గా ఆయన పేరు ప్రచారం జరిగినా ఎస్వీబీసీ అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు.

ఇక జగన్ సీఎం అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలపైన మెగాస్టార్ చిరంజీవితోపాటుగా పలువురు ప్రముఖులు కలిసి చర్చలు జరిపారు. అందులో దగ్గుబాటి సురేష్, రాజమౌళి వంటి వారు ఉన్నారు.

సినిమా టిక్కెట్ల వ్యవహారంపైన జరిగిన చర్చల్లోనూ పలువురు నిర్మాతలు.. తర్వాత హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు చిరంజీవితో కలిసి సీఎంను కలిశారు. కానీ ఆ చర్చల్లో సినీ ఇండస్ట్రీలో ప్రముఖలైన రాఘవేంద్రరావు సీఎంను కలిసేందుకు ముందుకు రాలేదు. అదే సమయంలోనూ ప్రభుత్వంపైన ఎటువంటి విమర్శలు చేయలేదు.

ఎన్టీఆర్ హయాం నుంచి నందమూరి కుటుంబంతో సత్సంబంధాలు కలిగిన రాఘవేంద్రరావు ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొంటున్నారు.రెండేళ్లలో చంద్రబాబు అధికారం చేపట్టడం ఖాయమంటూ రాఘవేంద్ర రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తోపాటు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.