Begin typing your search above and press return to search.

టీడీపీ విచిత్రమైన డిమాండ్

By:  Tupaki Desk   |   24 Sep 2021 2:30 PM GMT
టీడీపీ విచిత్రమైన డిమాండ్
X
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా బురదచల్లాలో టీడీపీ నేతలకు అర్ధం కావటంలేదు. అందుకనే అడ్డదిడ్డమైన ఆరోపణలు, విమర్శలతో జగన్ పై రెచ్చిపోతున్నారు. పాపం టీడీపీ నేతలను, చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలబడే మీడియాను చూస్తుంటే జాలేస్తోంది. ప్రభుత్వంలో తప్పులుంటే ఆరోపణలు, విమర్శలు చేయాటాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ప్రతిరోజు జగన్ ప్రభుత్వంపై ఏదో ఒకటి నెగిటివ్ గా రాయాలని, మాట్లాడాలని అజెండాగా పెట్టుకోవటంతోనే వీళ్ళకు సబ్జెక్టు దొరకటంలేదు.

ఇందుకు తాజా నిదర్శనమే గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతు గుజరాత్ లో పట్టుబడిన వేల కోట్ల విలువైన హెరాయిన్ పై వైసీపీ నేతలు ఎందుకు స్పందించటంలేదంటు చేసిన డిమాండ్ విచిత్రంగా ఉంది. హెరాయిన్ పట్టుబడింది గుజరాత్ పోర్టులో. దానిపై దర్యాప్తు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వ విభాగాలు. పట్టుబడిన హెరాయిన్ పై వైసీపీ నేతలు స్పందించటానికి ఏముంది ఇందులో ? కేవలం హెరాయిన్ కన్సైన్ మెంట్ కు విజయవాడ అడ్రస్ ఉందన్న ఏకైక కారణంతో చంద్రబాబు అండ్ కో రెచ్చిపోతున్నారు. కొందరేమో తాలిబన్లకు తాడేపల్లి ప్యాలెస్ కు లింకులుందంటారు. కొందరేమో ప్రభుత్వ పెద్దలే హెరాయిన్ డ్రగ్స్ ను ఏపిలోకి తెప్పిస్తోందంటు బురద చల్లుతున్నారు.

వీళ్ళ ఆరోపణలకు ఏమైనా ఆధారాలున్నాయా అంటే ఏమీలేదు. కేవలం జగన్ పై తమకున్న కసిని తీర్చుకోవటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. బుద్దా వెంకన్న మాట్లాడుతు రాష్ట్రంలో ఎగ్స్ వాడకంకన్నా డ్రగ్స్ వాడకం ఎక్కువైందన్నారు. ఏదో ప్రాసకోసం ఎగ్స్-డ్రగ్స్ అని చెప్పటమే కానీ రాత్రికి రాత్రి డ్రగ్స్ వాడకం పెరిగిపోతుందా ? తాలిబన్ల నుండి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు డ్రగ్స్ దిగుమతి అయిపోతోందని ఆరోపణలు చేయటం విచిత్రంగానే ఉంది.

పట్టుబడిన హెరాయిన్ పై ప్రభుత్వం, అధికారులు ఎందుకు స్పందించరంటు విచిత్రమైన ప్రశ్న వేశారు. అసలా డ్రగ్స్ కు ఏపికి ఎలాంటి సంబంధంలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. బాస్ ఆదేశాలతో ప్రభుత్వమే మాదక ద్రవ్యాల అమ్మకాలు, వాడకాన్ని ప్రోత్సాహిస్తోందని చేసిన ఆరోపణలు చాలా డ్యామేజింగ్ గా ఉన్నాయి. అంటే జగన్ పై వీళ్ళల్లో కసి ఎంతగా పేరుకుపోయిందో అర్ధమైపోతంది. ఇలాంటి బేస్ లెస్ ఆరోపణలు చేయటం కేసులు పెడితే ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతోందని గోల చేయడం టీడీపీ నేతలకు మామూలైపోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పరిషత్ ఎన్నికల్లో ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఏకపక్షంగా రావటాన్ని చంద్రబాబు అండ్ కో తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైనా జగన్ పై బురదచల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టే నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. తాలిబన్ల నుండి డ్రగ్స్ నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు దిగుమతవుతున్నాయని, ప్రభుత్వమే డ్రగ్స్ అమ్మకాలు, వాడకాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించటమే తాజా ఉదాహరణలు. అందుకనే వీళ్ళని చూసి జాలిపడటం తప్ప ఇంకేమీ చేయలేం.