మే 23 తరువాత సంచలనాలు ఇవే..

Sat Apr 13 2019 22:17:50 GMT+0530 (IST)

TDP on About Andhra Assembly Results

ఏపీ ఎన్నికల ఫలితాలకు ఇంకా 40 రోజుల టైం ఉన్నా కూడా ఇప్పటికే చాలాచోట్ల ఫలితం ఎలా ఉండబోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతల్లో కనిపిస్తున్న ఆందోళన.. వారివారి నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరు... వైసీపీకి ఓటేసేందుకు ప్రజలు రాత్రయినా బారులు తీరిన వైనం చూసినవారంతా ఈసారి ఫలితాలలో సంచలనాలు తప్పవంటున్నారు. ముఖ్యంగా టీడీపీలోని పలువురు కీలక నేతలకు ఓటమి తప్పదని చెబుతున్నారు.
   
ఓడిపోబోతున్న టీడీపీ ప్రముఖుల్లో ఎక్కువగా నారా లోకేశ్ పేరు వినిపిస్తోంది. మంగళగిరి నుంచి పోటీ చేసిన ఆయన పోలింగ్ రోజు రాత్రి కొన్ని కేంద్రాల్లో ఇంకా జనం ఓటేసేందుకు బారులు తీరి ఉండడంతో... 6 గంటల తరువాత వచ్చినవారికి కూడా అధికారులు ఓటేసే అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ నిరసన కూడా తెలిపారు. మంగళగిరిలో లోకేశ్ ఓటమి ఖాయమన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అక్కడ సిటింగ్ ఎమ్మెల్యే - వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తారంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన కేవలం 12 ఓట్ల తేడాతోనే గెలిచినా టీడీపీ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారు. రాజధాని ప్రాంత పక్షాన నిలిచి వారి సమస్యలపై పోరాడారు. దాంతో అక్కడ ఇతరులైతే గెలవడం కష్టమని భావించి - ఆళ్లను ఎలాగైనా ఓడించాలని లోకేశే దిగారు. కానీ లోకేశ్‌కు ఆళ్ల చేతిలో ఓటమి తప్పదని తెలుస్తోంది.
   
అలాగే కృష్ణాజిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకూ ఓటమి తప్పదంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈసారి ఓటమి చవిచూస్తారని వినిపిస్తోంది.
   
ఇక విజయనగరం జిల్లాలో మంత్రి సుజయకృష్ణ రంగారావు.. విశాఖలో చింతకాయల అయ్యన్నపాత్రుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప -గుంటూరులో గల్లా జయదేవ్ - ఒంగోలులో శిద్ధారాఘవరావు - నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి - అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరాం - మంత్రి కాలవ శ్రీనివాసులు - కర్నూలులో అఖిలప్రియ - కడపలో ఆదినారాయణరెడ్డికి ఓటమి తప్పదని తెలుస్తోంది.