Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు

By:  Tupaki Desk   |   23 Oct 2021 10:51 AM GMT
బ్రేకింగ్ : టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు
X
ఈ మధ్య కాలంలో సీఎం జగన్ ను దూషించిన కేసులో అరెస్టయిన టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభికి బెయిల్ మంజూరైంది. పట్టాభి బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న పిమ్మట పట్టాభికి బెయిల్ ఇస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. పట్టాభి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొన్నిరోజుల కిందట పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సమయంలోనే ఆయన బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కొద్దిరోజుల క్రితం ఓ మీడియా సమావేశంలో టీడీపీ నేత పట్టాభి, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయగా అందుకు నిరసనగా టీడీపీ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష చేయగా టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ జనాగ్రహ దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే.

సీఎం జగన్‌ పై పరుష పదజాలం ఉపయోగించినందుకు పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పట్టాభికి బెయిల్ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. రెండు వైపుల నుంచి లాయర్లు వాద ప్రతివాదనలు వినిపించారు. పట్టాభి చేసిన విమర్శల సీడీలను న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. రూల్ ఆఫ్ లా పాటించాలని కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రోసీజర్ ఫాలో కాకుండా అరెస్టు చేశారని అభిప్రాయం వ్యక్తం చేసింది. పోలీసులు దూకుడు తగ్గించుకోవాలన్న కోర్టు సూచించింది. థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎలా రిమాండ్ ఇచ్చారో చెప్పాలని హైకోర్టు వివరణ కోరింది.