Begin typing your search above and press return to search.

టీడీపీ ఇక ఖాళీయే .. సోము కీలక వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   13 Nov 2019 7:54 AM GMT
టీడీపీ ఇక ఖాళీయే .. సోము కీలక వ్యాఖ్యలు !
X
ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా సాగుతుంది. ఒకవైపు రాష్ట్రం లో ప్రధాన సమస్య గా మారిన ఇసుక కొరత పై విపక్షాలు అన్ని కలిసి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతున్నా .. మరో వైపు మాత్రం వలస ల రాజకీయానికి లో లోపల జరగాల్సిన ప్రక్రియ మొత్తం సాగుతోంది అని నేతల మాటల బట్టి అర్థమౌతుంది. గడిచిన సార్వత్రిక ఎన్నికల లో టీడీపీ చరిత్ర లో ఎన్నడూ చూడనటువంటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రం లో పోటీ చేసిన 175 సీట్లకి గాను ..కేవలం 23 స్థానాల లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఇక తాజా గా టీడీపీ కి గన్నవరం ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ టీడీపీ కి , తన ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేస్తునట్టు ప్రకటించి పార్టీ అధినేత చంద్రబాబు కి లేఖని పంపారు. దీనిపై చంద్రబాబు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వంశీ ని ఎలాగైనా బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రం లో కలకలం సృష్టిస్తున్నాయి. అయన మాట్లాడుతూ ..త్వరలోనే ఏపీ రాజకీయాలలో పెను మార్పులు జరగబోతున్నాయని ..ఈ శాసనసభ లో బీజేపీ ప్రాతినిధ్యం ఉండటం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

అలాగే .. మాజీ మంత్రి , ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు , నన్ను కలవడం జరిగింది. సాధారణంగా ఇద్దరు రాజకీయ నేతలు కలిస్తే ఏ విషయం చర్చకు వస్తుందో ప్రజలకు తెలుసు అంటూ ఇండైరెక్ట్ తాను చెప్పాలి అనుకున్నది చెప్పేసారు. ఏపీలో త్వరలో టీడీపీ ఖాళీ కాబోతోంది అని , టీడీపీలో ఉన్న మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు బీజేపీ లోకి చేరడానికి సిద్ధం గా ఉన్నారంటూ తెలిపారు. వీరి తో పాటు గా మరి కొందరు నేతలు కూడా బీజేపీ లోకి రావడానికి సిద్ధం గా ఉన్నారు అని, ప్రస్తుతం రాష్ట్రం లోని ప్రజలు చంద్ర బాబు చెప్పే కల్లబొల్లి మాటలని నమ్మే స్థితిలో లేరు అని , చంద్రబాబు సమయం అయి పోయింది అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.