టీడీపీ టీజింగ్ : లెంగ్దీ క్వశ్చన్స్ అడగవద్దు ప్లీజ్ ?

Tue May 24 2022 13:00:07 GMT+0530 (IST)

TDP Teasing on cm jagan

దావోస్ లో వరల్డ్ ఎనకమిక్ ఫోరం మీటింగ్ లో చాలా ఆసక్తికర సందర్భం ఒకటి వెలుగు చూసింది. కరోనాకు సంబంధించి మహమ్మారి నియంత్రణకు సంబంధించి ముఖ్యంగా హెల్త్ అండ్ వెల్త్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుండగా జగన్ మాత్రం లెంగ్దీ క్వశ్చన్స్ అడగవద్దు అని అన్నారు.ఇదే ఇప్పుడు టీడీపీ ట్రోల్ చేస్తోంది. అస్సలు ఓ ముఖ్యమంత్రి హోదాలో ఆయనేం ప్రిపేరయి వెళ్తే కదా ! అక్కడ మాట్లాడడానికి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

వాస్తవానికి గతంలో తమ అధినేత చంద్రబాబు ఇదే దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ రోజు వైసీపీ నాయకులు ఎన్నో జోకులు వేశారు అని కానీ ఇప్పుడు అదే వరల్డ్ ఎకనమిక్ ఫోరం మీటింగ్ కు పోయి కనీస స్థాయిలో కూడా మాట్లాడలేక చతికిలపడుతు న్నారు అని టీడీపీ జోకులు వేస్తోంది.

ఏదేమయినప్పటికీ కరోనా కోరలు పీకెయ్యడంలో జగన్ సర్కారు సక్సెస్ అయిన తీరు తాము మరువలేమని. ఆ రోజు ఆక్సిజన్ బెడ్లు లేక ప్రభుత్వాస్పత్రులు వెలవెలబోతే. ఇదే అదునుగా కార్పొరేట్ వైద్య శాలలు పిండుకున్న వైనం కూడా మరిచిపోలేం అని కమ్యూనిస్టు పార్టీలు సైతం అంటున్నాయి.

భవిష్యత్ కు సాక్షంగా ఆరోగ్య వ్యవస్థలు అనే అంశం పై జగన్ మాట్లాడిన విధానం విన్నవారెవ్వరయినా రాష్ట్రంలో ఇప్పుడున్న అంబులెన్స్ మాఫియా గురించి తలుచుకోకుండా ఉండలేరని కూడా కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నారు.

ఇవేవీ ఇవాళ కొందరికి గుర్తుకురావని ఆ రోజు కరోనా నియంత్రణలో వైఫల్యాలు గురించి మాట్లాడకుండా వాటిని దాటి దాచి పెట్టినంత మాత్రాన వాస్తవాలు అంతర్జాతీయ వేదికలకు తెలియకుండా ఉండవని అనుకోలేంఅని అయినా పబ్లిక్ హెల్త్ కు జగన్ కేటాయించిన నిధులు ఎన్నని ఓ డిబెట్ పెడితే అసలు నిజాలు బయటకు వెలుగులోకి వస్తాయని కూడా అంటున్నారు ఇంకొందరు. భవిష్యత్ కాదు కదా రాష్ట్రం తాలుకా వర్తమానమే అస్సలు బాలేదని అగమ్య గోచరంగా ఉందని పెదివి విరుస్తున్నారు.