టీడీపీ నేతలు..సోలోగా సాధించలేమని ఫిక్సయ్యారా!

Wed Sep 11 2019 12:26:09 GMT+0530 (IST)

TDP Ready to Alliance with Janasena and BJP

తెలుగుదేశం పార్టీ ప్రస్థానం అంతా ఏదో ఒక పార్టీతో పొత్తుతోనే ఉంటుంది. బీజేపీకి దేశంలో ఎప్పుడైతే ఊపు ఉంటుందో అప్పుడు ఆ పార్టీతో జత కట్టి తెలుగుదేశం లబ్ధి పొందుతూ వచ్చింది. ఇటీవలి ఎన్నికల సమయంలో బీజేపీ ఊపు మీదున్నా.. ఆ పార్టీతో తెలుగుదేశం పార్టీ జత కట్టలేదు.  తన చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఒంటరిగా పోటీ చేసింది. అక్కడకూ జనసేనతో - కాంగ్రెస్ తో ఆఖరికి ప్రజాశాంతి పార్టీతో లోపాయికారీ ఒప్పందాలతో టీడీపీ పోటీ చేసినా ప్రయోజనం దక్కలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.ఏతావాతా సోలోగా పోటీ చేసి కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అయ్యింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు అయిపోయిన మూడు నాలుగు నెలలకే ఆ పార్టీ వాళ్లు ఫుల్ క్లారిటీకి వచ్చినట్టుగా ఉన్నారు. తాము సోలోగా నెగ్గుకు రాలేమని వారు ఫిక్సయినట్టుగా ఆ పార్టీ నేతల మాటలే స్పష్టం చేస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు ఈ విశ్లేషణలకు ఊతం ఇస్తూ ఉన్నాయి. తాము బీజేపీ - జనసేనలను కలుపుకుపోతామని తరచూ ఆయన చెబుతూ ఉన్నారు. దీంతో ఆ పార్టీలతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ ఎంతగా వెంపర్లాడుతోందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

తాము సోలోగా ఏం సాధించలేమని… జగన్ ను ఎదుర్కొనడం తమకు చేతనయ్యే పని కాదని.. పవన్ కల్యాణ్ ను  - కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కలుపుకుంటేనే.. ఉనికి చాటడం కానీ - రేపటి ఎన్నికల్లో పోరాడటం కానీ సాధ్యం అవుతుందని తెలుగుదేశం పార్టీ వాళ్లు గట్టిగా ఫిక్సయ్యారని.. ఇక వారి ప్రయత్నాలు అన్నీ అలానే ఉంటాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.