Begin typing your search above and press return to search.

అచ్చెన్న‌పై ఆరోప‌ణ‌లు..కులకోణాన్ని ఎత్తుతున్న టీడీపీ!

By:  Tupaki Desk   |   22 Feb 2020 2:30 PM GMT
అచ్చెన్న‌పై ఆరోప‌ణ‌లు..కులకోణాన్ని ఎత్తుతున్న టీడీపీ!
X
ఈఎస్ ఐ స్కామ్ విష‌యంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. నామినేష‌న్ మీద భారీ ఎత్తున వ్య‌వ‌హారాల‌ను న‌డిపించార‌ని - అచ్చెన్న ఆధ్వ‌ర్యంలో భారీ అవినీతి జరిగింద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. మామూలుగా అయితే ఇవి ఆరోప‌ణ‌లే. అయితే ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఇలాంటి వ్య‌వ‌హారంలో అరెస్టులు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో ఏపీలోనూ అలాగే జ‌రిగింద‌ని తెలుస్తోంది. తెలంగాణ విధాన‌మే ఏపీలో న‌డించింద‌ని తెలుగుదేశం వ‌ర్గాలు కూడా అంటున్నాయి. ఈ నేఫ‌థ్యంలో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ అచ్చెన్న‌ను స‌హ‌జంగానే ర‌క్షించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తూ ఉంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఒంటి కాలి మీద లేచే వ్య‌క్తి అచ్చెన్న. గ‌తంలో ఐదేళ్ల అధికారం కాలంలో అయినా, ఇప్పుడు అయినా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై అచ్చెన్న తీవ్రంగా విరుచుకుప‌డుతూ ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న‌కే అవినీతి మ‌కిలి అంటుకుంటే తెలుగుదేశం పార్టీకి అది గట్టి ఝ‌ల‌క్ అవుతుంది.

అందుకే ఈ వ్య‌వ‌హారాన్ని వీలైనంత‌గా త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నాలు చేస్తున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. అందులో మొద‌టి విషయం అచ్చెన్న కులం. ఆయ‌న కులం పేరును టీడీపీ ఎత్త‌డం లేదు. అయితే ఆయ‌న బీసీ అని - అలాంటి బీసీ నేత‌పై అవినీతి ముద్ర వేస్తారా? అంటూ తెలుగుదేశం నేత‌లు ప్ర‌శ్నిస్తూ ఉన్నారు! ఒక బీసీ నేత‌ల‌ను అణ‌గ‌దొక్క‌డానికి ఇలాంటి అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తోందంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై టీడీపీ విమ‌ర్శ‌లు చేస్తూ ఉంది!

అయితే ఒక రాజ‌కీయ నేత‌ - మాజీ మంత్రిపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తే.. ఆయ‌న కులాన్ని ఎత్త‌డం మాత్రం కామెడీనే. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో మంది రాజ‌కీయ నేత‌ల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు - కేసులు వ‌చ్చాయి. అయినంత మాత్రాన వాళ్లు త‌మ కులాన్ని అడ్డుపెట్టుకుని బ‌య‌ట‌ప‌డాల‌ని చూడ‌టం కేవ‌లం అవ‌కాశ‌వాద‌మే అవుతుంది. అవినీతికి కులాన్ని అడ్డుపెట్టుకోవ‌డం అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్లు ఇదే చేస్తున్నారు. బీసీ అంటూ అచ్చెన్న‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రి ఈ కులం కోణం ఎంత వ‌ర‌కూ కాపాడుతుందో!