రేపు రాష్ట్రమంతటా టీడీపీ ధర్నాలు..ఎందుకంటే!

Sun Jul 05 2020 19:20:04 GMT+0530 (IST)

TDP Planning For Dharnas in Andhra Tomorrow

జగన్ పథకాల వేగంలో జనం దృష్టి మరలకుండా కోవిడ్ నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీని యాక్టివ్ గా ఉంచడానికి చంద్రబాబు ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఏదో ఒక అంశంతో మీడియాలో ఉంటున్నారు. జూమ్ యాప్ తోనే పార్టీని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరోజు క్రితం అమరావతి రైతుల పోరాటానికి 200 రోజులు అయిన సందర్భంగా టీడీపీ పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చింది.మల్లీ రేపు మరో పోరాటానికి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో రేపు అన్ని జిల్లాలు నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో  నిరసనలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ఇందులో పాలుపంచుకోవాలని పార్టీ పేర్కొంది.

జూలై 6వ తేదీ సోమవారం  హౌసింగ్ పెండింగ్ బిల్లులు - గత ప్రభుత్వం నియమించిన ఇళ్లు స్వాధీనం చేయకపోవడంపై.. టీడీపీ హయాంలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ - మాస్కులు తప్పనిసరిగా ధరించి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా చంద్రబాబు పిలుపుపిచ్చారు. మరి కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి ఎంతవరకు స్పందన వస్తుందో చూడాలి.