టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. వైసీపీనే చేసిందని ఆరోపణలు?

Sat Oct 01 2022 17:06:45 GMT+0530 (India Standard Time)

TDP Official Twitter Account Hacked

టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. టైలర్ హాబ్స్ పేరుతో హ్యాకర్లు టీడీపీ పేరును మార్చేసి తమకు ఇష్టమైన పోస్టులు పెట్టేశారు. అలాగే ఆ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ మేరకు తమ టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయ్యిందని టీడీపీ డిజిటల్ వింగ్ శనివారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇప్పుడీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.టీడీపీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన వారు టీడీపీ పోస్టులకు బదులుగా ఇతర పోస్టులు పెడుతున్నారు. అలాగే డిస్క్రిప్షన్ ను మార్చేశారు. దీంతో రెగ్యులర్ గా టీడీపీ ఖాతాను పాలో అయ్యే వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ట్విట్టర్ పోస్టులు పెడుతున్నారు.

ఇక వైసీపీ మద్దతుదారులే ఈ పనిచేశారని టీడీపీ ఆరోపిస్తోంది. అతి త్వరలోనే టీడీపీ ఖాతాను అందుబాటులోకి తీసుకురానున్నామని ప్రకటించారు. గతంలోనూ టీడీపీ ట్విట్టర్ అకౌంట్ సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. అప్పుడు కూడా ఈ విషయాన్ని టీడీపీ ఐటీ విభాగం గుర్తించి వెంటనే అప్రమత్తమైంది. ట్విట్టర్ లో అసభ్య మెసేజ్ లు పంపినట్టు గుర్తించింది.అయితే ఎలాంటి నష్టం జరగలేదని టీడీపీ ఐటీ విభాగం స్పష్టం చేసింది.

టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే తొలిసారి కాదని.. నాలుగు నెలల క్రితం కూడా ఓసారి ఇలాగే జరిగింది. దాన్ని ట్విట్టర్ తో మాట్లాడి పునరుద్దరించారు.

ఇక తమ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టైలర్ హాబ్స్ పేరుతో తమ పార్టీ ట్విట్టర్ ఖాతాను మార్చివేయడం వెనుక వైసీపీ సానుభూతిపరుల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.

ఇక దీన్ని పునరుద్దరించేందుకు టీడీపీ సోషల్ మీడియా విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. ట్విట్టర్ ఖాతా మారిపోవడంతో దాన్ని వాడి హ్యాకర్లు ఎలాంటి పోస్టులు పెడుతారో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటి వరకూ ఎలాంటి నష్టం జరగకుండా నిపుణుల సాయం తీసుకొని ట్విట్టర్ అకౌంటన్ ను పునరుద్దరించనున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.