అన్నీ బాబు చేసిన తప్పులు అయితే మనం రెండున్నరేళ్లలో ఏం చేశాం మంత్రిగారూ!

Sat Dec 04 2021 19:21:55 GMT+0530 (IST)

TDP Member satires On Anil kumar

అంతన్నాడు.. ఇంతన్నాడే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఇప్పుడు చంద్రబాబుదే తప్పు అంటున్నాడే అని టీడీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం.. భారీ తుఫాను ధాటికి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఆ తప్పును కూడా వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఆ ప్రాజెక్టుకు ఆ పరిస్థితి అనడంపై సెటైర్లు పడుతున్నాయి.తాజాగా అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని మంత్రి అనిల్ కుమార్ చేసిన వాదనపై సెటైర్లు పడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్వహణలో ఉండి.. జగన్ సర్కార్ మానిటరింగ్ చేస్తున్న అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే గత చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఏంటో లాజిక్ అర్థం కావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసే తప్పులు అన్నీ గత చంద్రబాబుపై నెపం నెట్టి వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోంది వైసీపీ సర్కార్. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి చంద్రబాబు కారణమని జగన్ మంత్రులు ఆరోపించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా కూడా జగన్ సర్కార్ అదే పోలవరంను పూర్తి చేయలేకపోవడం ఏంటని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

ఇక అమరావతి విషయంలోనూ అదే కథ.. చంద్రబాబు మీద నెపం వేసి కాలం గడుపుతున్న వైసీపీ సర్కార్ అటు మూడు రాజధానులను పట్టాలెక్కించక.. ఇటు అమరావతిని గట్టెక్కించలేక మొత్తం చంద్రబాబే చేశాడనడంలో ఔచిత్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే దాన్ని కూడా గత చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం అనడం ఎంతవరకూ కరెక్టో ఏపీ జలవనరుల శాఖ మంత్రివర్యులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.

ప్రతీదానికి చంద్రబాబుపై నెపం నెట్టి ఎన్నాళ్లు వైసీపీ సర్కార్ మాయ చేస్తుంది? ఎన్నాళ్లు ఇలా తప్పించుకుంటుందన్నది ఇక్కడ ప్రశ్న.. అన్నీ చంద్రబాబు చేసిన తప్పులు అయితే మనం రెండున్నరేళ్లలో ఏం చేశాం మంత్రిగారూ! అని ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ను ఏపీ జనాలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రివర్యులపై ఉంది.. చూద్దాం ఎలా స్పందిస్తారో.?