ఛీ..ఛీ.. ఫిరాయింపుల మీద తమ్ముళ్లు మాట్లాడటమా?

Thu Jun 27 2019 15:48:45 GMT+0530 (IST)

అందుకే అనేది తప్పులు చేయొద్దని. చేతిలో అధికారంలో ఉన్న వేళ ప్రత్యర్థులను కసితీరా అణిచివేయాలన్నట్లుగా వ్యవహరించటం.. ఆ పాపం తగిలినప్పుడు విలవిలలాడిపోతూ బేల మాటలు మాట్లాడటంలో బాబు బ్యాచ్ కు ఉన్నంత అనుభవం మరెవరికీ లేదని చెప్పాలి. తాజాగా రాజ్యసభకు చెందిన నలుగురు టీడీపీ ఎంపీలు రూల్ బుక్ ప్రకారం  బీజేపీలో విలీనం కావటం తెలిసిందే. దీనిపై తాజాగా టీడీపీ ఎంపీ ఒకరు రాజ్యసభలో మట్లాడారు.రాజకీయ ఫిరాయింపులపై తెలుగుదేశం పార్టీ మాట్లాడిన తీరుపై పలువురు కిసుక్కున నవ్వుకుంటున్న పరిస్థితి. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ను అడ్డం పెట్టుకొని తప్పుడు విలీనాలు చేస్తున్నారంటూ టీడీపీ ఎంపీ రవీంద్ర  కుమార్ వాపోయారు. ఫిరాయింపు రాజకీయాల్ని ఆ పార్టీ నిరసించింది.

మరి.. తాము అధికారంలో ఉన్నప్పుడు విపక్షానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్ని టోకుగా కొనేసిన వైనంపై తమ్ముళ్లు వివరణ ఇస్తే బాగుంటుంది. తాము చేస్తే ఒప్పు.. ఎదుటవాళ్లు చేస్తే తప్పు అన్నట్లుగా ఉన్న టీడీపీ నేతలు తీరుపై రాజ్యసభలోని ఇతర పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎదవ రాజకీయాలు చేయటం ఎందుకు.. ఇప్పుడు గుండెలు బాదుకోవటం ఎందుకు? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ఇప్పుడు విలువల గురించి మాట్లాడుతున్న నేతలు.. పార్టీ పిరాయింపుల్ని ప్రోత్సహించినప్పుడు ఇలాంటివేమీ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు.

దరిద్రపుగొట్టు రాజకీయాల్ని ప్రోత్సహించి.. ఇప్పుడు తమకు నష్టం వాటిల్లేసరికి గుండెలు బాదుకుంటే ఎలాంటి ప్రయోజనం లేదని.. దీని వల్ల సానుభూతి కాదు.. చేసిన తప్పులు మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తాయన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఎదవ పని చేసినప్పుడు లేని సోయి.. అలాంటి పనికే బాధితుడిగా మారినప్పుడు ఫీల్ కావటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.