ఈ ధీమానే టీడీపీ నేతను గతంలో ఓడించింది.. మరి ఇప్పుడు..?

Mon Sep 26 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

TDP Leaders In Andhrapradesh

నాయకలకు.. ధీమా ఉండొచ్చు. కానీ.. అతి ఎవరికీ మంచిది కాదు. అయితే.. అతిగా పోతున్న కొందరు నాయకులు.. వ్యవహరిస్తున్నతీరు.. వారికి మైనస్ మార్కులు వేసేలా చేస్తోందనే అబిప్రాయం వ్యక్తమవు తోంది. టీడీపీలో ఇలాంటి అతి నాయకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇంకేముంది.. మాదే గెలుపు.. వైసీపీని ప్రజలు ఛీకొడుతున్నారనే ప్రచారం దంచికొట్టారు. దీంతో ఎన్నికల సమయంలో పెద్దగా సమర్థవంతంగా పనిచేసిన పరిస్థితి లేదు.దీంతో గెలుపు గుర్రం ఎక్కుతారని అనుకున్న నాయకులు కూడా.. ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఈమూడే ళ్లలో అయినా.. వారు మారారా? అంటే.. మారినట్టు కనిపిస్తున్నారు.. అంతే! ఏదైనా చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినప్పుడో.. ఆవేదన చెందినప్పుడో.. హెచ్చరించినప్పుడో.. సదరు నాయకులు తెరమీదికి వస్తు న్నారు. మిగిలిన టైం అంతా.. కూడా తమ తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో పార్టీ పరువు పోవడం మాట అటుంచి.. నాయకులగెలుపు ప్రశ్నార్థకంగా మారుతోంది.

ఇలాంటి వారిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. ముందున్నారని అంటున్నారు. అంతర్గత కుమ్ములాటలు.. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఒక విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్న గ్యాపనేచెప్పాలి. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోఒకప్పుడు.. తనకు వెన్నుదన్నుగా ఉన్న కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రితోనే.. ఆయన దూరం పాటిస్తున్నారు. ఇక ఎంపీతో ఉన్న వైరం అందరికీ తెలిసిందే. మిగిలిన నాయకులతోనూ ఆయన డిస్టెన్స్ పాటిస్తున్నారు.

సరే.. ఇది ఎలా ఉన్నా.. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. ఎవరినీ ఆయన కలవడం లేదు. ఎక్కడా.. ఆయన మాట కూడా వినిపించడం లేదు. మూడేళ్ల లో ఇప్పటి వరకు ఒక్కసారిగా కూడా ఆయన నియోజకవర్గం ముఖం చూసింది లేదు. ఒక్క కార్పొరేషన్ ఎన్నికల సమయంలో మాత్రం ఒకింత హడావుడి చేశారు. మరి ఆయన ధీమా ఏంటి? అంటే.. వైసీపీ మైనస్‌లు తనకు ప్లస్‌గా మారతాయని అంటున్నారుఆయన అనుచరులు. కానీ ఇదే వ్యూహం గతంలోనూ పాటించే.. కేవలం 25 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా.. ఆయన మారితే బెటర్ అంటున్నారు.