Begin typing your search above and press return to search.

ఏపీని స‌ర్వ‌నాశనం చేస్తున్న టీడీపీ, వైసీపీ

By:  Tupaki Desk   |   23 Oct 2021 3:30 AM GMT
ఏపీని స‌ర్వ‌నాశనం చేస్తున్న టీడీపీ, వైసీపీ
X
రాష్ట్రంలోని రెండు ప్ర‌ధాన పార్టీలూ రాష్ట్ర అభివృద్ధిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా.. కేవ‌లం బూతులతో నే కాల‌క్షేపం చేస్తున్నాయా? ఇదే విష‌యం.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌గా మారిందా? ఈ రెండు పార్టీలూ.. రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నాయ‌ని.. ప్ర‌జ‌లు భావిస్తున్నారా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు ఔన‌నే అంటున్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో అనేక క‌ష్టాలు.. న‌ష్టాల‌తో న‌వ్యాంధ్ర ఏర్ప‌డింది. దాదాపు 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఏపీ ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో పాల‌కుల‌పై ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌కు తెస్తార‌ని.. బాగు చేస్తార‌ని అనుకున్నారు.

అయితే.. ఇప్పుడు వారి అంచ‌నాలు త‌ల‌కిందులు అయ్యాయ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని ప‌క్క‌న పెట్టి టీడీపీ, వైసీపీలు.. బూతుల‌పై యుద్ధం చేసుకుంటున్నాయి. బూతుల పార్టీలుగా మారిపోయాయ‌నే వాద‌న వినిపిస్తోంది. భావి త‌రాల‌కు మంచి చేస్తాయ‌ని.. రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్న‌త‌మైన స్థాయిలో నిల‌బెడ‌తాయ‌ని భావించిన టీడీపీ, వైసీపీలు ఇప్పుడు.. బూతుల పార్టీలుగా మిగిలిపోయాయ‌నే వాద‌న వినిపిస్తోంది. రాష్ట్ర విడిపోయిన త‌ర్వాత‌.. 2014లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో రాష్ట్రాన్ని ముందుండి న‌డిపించేందుకు.. అభివృద్ది చేసేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు అయితే క‌రెక్ట్ అనుకున్నారు ప్జ‌లు.

ఈ క్ర‌మంలోనే టీడీపీకి అధికారం క‌ట్ట‌బెట్టారు. అయితే.. టీడీపీ హ‌యాంలో అభివృద్ధి అనే మాట‌ను మాట ల్లోనే చూపించారు త‌ప్ప‌.. చేత‌ల్లో కాద‌నే వాద‌న ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించారు. డిజిట‌ల్ రూపంలో అద్భుతాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు. ఇక‌, ల్యాండ్ పూలింగ్ అంటూ.. భారీ ఎత్తున భూములు సేక‌రించారు. కానీ, ఎక్క‌డా క‌ట్టింది లేదు. అన్నీ తాత్కాలిక క‌ట్ట‌డాల‌తోనే కాలం గ‌డిపేశారు. ఇక‌, అప్పులు తెచ్చి.. సంక్షేమ ప‌థ‌కాలు చేశారు. నిజానికి గ‌త ఎన్నిక‌లకు ముందు కూడా చంద్ర‌బాబు రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చి ప‌సుపు-కుంకుమ కింద ప్ర‌జ‌ల‌కు పందేరం చేశార‌నే వాద‌న ఉంది.

ఈ క్ర‌మంలో నాటి ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ నేత‌లు.. టీడీపీని అడ్డ‌గోలుగా తిట్టారు. కోర్టుకు వెళ్లారు. అడుగ‌డుగునా.. అడ్డుకున్నారు. దీంతో ఈ రెండు పార్టీలు అప్ప‌ట్లోనే రోడ్డున ప‌డ్డాయి. బ‌ఫూన్ అంటూ.. అసెంబ్లీలోనే దూషించుకున్నారు. అరాచ‌క వాది అంటూ.. టీడీపీ ఎదురు దాడి చేసింది. ఇలా ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకున్నారు. నిలువునా .. బూతులు తిట్టుకున్నారు. ఇక‌, మార్పు కావాల‌ని అంటూ.. ఒక్క ఛాన్స్ అన్న జ‌గ‌న్‌వైపు.. ప్ర‌జ‌లు.. మొగ్గు చూపారు. ఈ క్ర‌మంలోనే 2019 ఎన్నిక‌ల్లో.. వైసీపీని గెలిపించారు.

అయితే... వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు డెవ‌ల‌ప్‌మెంట్ లేదు. ఒక్క ఇటుక పేర్చింది లేదు. మూడు రాజ‌ధానులు అంటూ.. ఉన్న రాజ‌ధానిని ప‌క్క‌న పెట్టారు. పోనీ.. ఇత‌ర అభివృద్ధి కార్య‌క్ర‌మాలు అయినా.. చేప‌ట్టారా? అంటే అది కూడా లేదు. కేవ‌లం అప్పులు తీసుకురావ‌డం.. జ‌నాల‌కు పంచ‌డం త‌ప్ప‌.. ఏమీ చేయ‌లేదు. అయితే.. క‌రోనా కార‌ణంగా.. పంచాంఅని.. వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. అదేస‌మ‌యంలో.. న‌వ‌రత్నాలు ముందుగానే డిసైడ్ అయ్యాయి... కాబ‌ట్టి.. ఎన్ని అప్పులు తెచ్చి అయినా.. న‌వ‌ర‌త్నాలు అమ‌లు చేస్తున్నాము అని అంటున్నారు.

అదేస‌మ‌యంలో మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌తో ఉన్న రాజ‌ధాని ప‌నులు పూర్తిగా ప‌క్క‌న పెట్టారు. పోనీ.. ఇదైనా ముందుకు తీసుకువెళ్లారా? అంటే.. కోర్టు ఆదేశాల‌తో దీనిపై స్టేరావ‌డంతో ఈ ప‌నులు కూడా ఆగిపోయాయి. ఫ‌లితంగా పెట్టుబ‌డులు రావ‌డం లేదు. రియ‌ల్ ఎస్టేట్ నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధే డైల‌మాలో ప‌డింద‌నే వాద‌న బాహాటంగానే వినిపిస్తోంది. ఇదేస‌మ‌యంలో పెట్టుబ‌డి దారులు తెలంగాణ‌కు, హైద‌రాబాద‌కు క్యూ క‌డుతున్నారు. అక్క‌డ పెట్టుబ‌డులు పెడుతున్నారు.

దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్నారు. ఏపీని ఏం చేద్దామ‌నుకుంటున్నారు? అని టీడీపీ, వైసీపీల‌ను వారు ప్శ్నిస్తున్నారు. ఈ రెండు పార్టీలూ క‌లిసి ఏపీని స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నారు.. అని అంటున్నారు. ఈ పార్టీ అధినేతల‌ `అహం` కోసం రెండు పార్టీల నేత‌లు.. స‌భ్య స‌మాజం సిగ్గుప‌డేలా బూతులు మాట్లాడుతున్నార‌ని.. అంటున్నారు. వాళ్లు వాళ్లు తిట్టుకుని.. మ‌ళ్లీ ప్ర‌జాస్వామ్యం అంటూ.. ధ‌ర్నాలు,, బంద్‌లు చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందుల‌కుగురి చేస్తున్నార‌రు. వాళ్లు వాళ్లు తిట్టుకుని ఒక‌రిపై ఒక‌రుకేసులు పెట్టుకుని ప్ర‌జాస్వామ్యం అంటుంటే.. ఏమ‌నాల‌ని సామాన్య ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

ముఖ్యంగా మేధావులు కూడా.. ఈ రెండు పార్టీలు చేస్తున్న రాజ‌కీయాలు.. బూతుల ప‌ర్వాల‌ను అస‌హ్యించుకుంటున్నారు. నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడు కోవాల్సిన మాట‌ల‌ను కూడా బ‌హిరంగ వేదిక‌ల‌పై మాట్లాడుతూ. ఇలా ర‌రోడ్డున ప‌డ‌తారా? అంటూ.. వారు నిల‌దీస్తున్నారు. ఏదేమైనా.. అనేక ఇబ్బందులు క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను, రాష్ట్రాన్ని వ‌దిలేసి.. రెండు ప్ర‌ధాన పార్టీలు రోడ్డున ప‌డ‌డం చూస్తే.. ఈ రెండు పార్టీల‌కూ అస‌లు ఎందుకు ఓటేయాల‌నే ప్ర‌శ్న సామాన్యుల్లో క‌నిపిస్తోంది. మ‌రి ఇదే క‌నుక ముదిరితే.. ఈ రెండు పార్టీల‌కూ న‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మీ ద‌గ్గర‌ ఏమైనా స‌మాచారం ఉంటే.. కామెంట్స్ రూపంలో పెట్టండి.. మేం ప్ర‌చురిస్తాం. మీకు న‌చ్చితే లైక్ కొట్టండి.. షేర్ చేయండి.