Begin typing your search above and press return to search.

అందరూ తీసేస్తుంటే.. టీసీఎస్ కొత్తగా 40 వేల ఉద్యోగాలు

By:  Tupaki Desk   |   14 July 2020 5:49 PM GMT
అందరూ తీసేస్తుంటే.. టీసీఎస్ కొత్తగా 40 వేల ఉద్యోగాలు
X
మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో సాఫ్ట్ వేర్ రంగం కుదేలయింది. దీంతో ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడింది. దీంతో యాజమాన్యాలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జీతాల్లో కోత.. ఉద్యోగొల తొలగింపు వంటివి చేస్తున్నారు. లెస్ హ్యుమన్ పవర్..మోర్ వర్క్ అనే సూత్రానికి పదును పెట్టాయి. అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇలా ఉండగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మాత్రం ఈ సమయంలో కూడా ఉద్యోగులను తీసుకుంటుండడం విశేషం.

కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టింది. ఏకంగా 40 వేల ఉద్యోగులను తీసుకోనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ ప్రకటించారు. 40 వేల మందిని కొత్తగా నియమించుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అయితే వారందరినీ క్యాంపస్ రిక్రూట్ మెంట్ విధానంలోనే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. దీంతోపాటు అమెరికాలో మారిన విధానంతో అక్కడ హెచ్ 1బీ.. ఎల్ 1 వర్క్ విధానంపై ఆధారపడడం తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీనికోసం అమెరికాలోనే 2 వేల మందిని నియమించుకోనున్నట్లు మిలింద్ తెలిపారు.