రేవంత్ నయా ప్లాన్‌తో టీ కాంగ్రెస్ నేతల్లో కలవరం...!

Sun Nov 28 2021 16:28:42 GMT+0530 (IST)

T Congress leaders worried about Revanth new plan

రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయ్యే ముందు వరకు వచ్చే ఎన్నికలకు ముందు వరకు ఆయనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికి ఉంటుంది అన్న ఆశలు ఎవ్వరికీ లేవు. 2024 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ టీఆర్ఎస్ - బీజేపీ మధ్య ఉంటుందని అందరూ భావించారు. ఖచ్చితంగా కాంగ్రెస్‌కు మూడో స్థానం ఉంటుందని... ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ఉండరని తలపండిన రాజకీయ మేధావులు సైతం భావించారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు.. అన్న ఆలోచనలు ప్రతి ఒక్కరిలోను మొదలయ్యే వరకు రాజకీయం మారింది.రేవంత్ పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో సరి కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న కొన్ని సామాజిక వర్గాల్లో మార్పులు కనిపిస్తూ ఉండటం... రేవంత్ దూకుడు
టీ.కాంగ్రెస్ నేతల్లో అధికారం అశలు కలిగేలా చేస్తున్నాయి. రేవంత్ అక్కడ పార్టీ పగ్గాలు చేపట్టాక పార్టీని సమూలంగా ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ పార్టీలో పని దొంగలను పక్కన పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

పార్టీని జిల్లా స్థాయి నుంచి సమూలంగా మార్చాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ఈ ఏడాది చివర్లో పనితీరు సరిగా లేని జిల్లా అధ్యక్షులు మార్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలని రాహుల్ గాంధీ జిల్లా పార్టీ అధ్యక్షులు అభిప్రాయాలు తీసుకున్నప్పుడు... మెజార్టీ పార్టీ జిల్లా అధ్యక్షులు రేవంత్ వైపు మొగ్గు చూపితే.. కొంత మంది మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని ప్రతిపాదించారు.

అయితే ఇప్పుడు రేవంత్ మార్పులు చేర్పులు చేస్తోన్న నేపథ్యంలో కోమటిరెడ్డి వర్గంగా పేరున్న జిల్లా అధ్యక్షులను ముందుగా మారుస్తారని అంటున్నారు. కోమటిరెడ్డి ఉమ్మడి నల్లగొండ రంగారెడ్డి మహబూబ్‌నగర్ వరంగల్ జిల్లాల్లో కొంత పట్టు ఉంది. మరి ఈ జిల్లాల్లో కోమటిరెడ్డి వర్గం నేతలకు ఛాన్స్ ఇస్తారా ?  లేదా ?  రేవంత్ పూర్తిగా తన టీంనే సెట్ చేసుకుంటారా ? అన్నదే చూడాలి. అయితే వృద్ధ నేతలను పక్కన పెట్టేసి కొత్త తరం నేతలకు ఛాన్స్ ఇవ్వాలన్నది రేవంత్ టార్గెట్. అదే జరిగితే చాలా మంది సీనియర్లు సైడ్ అవ్వక తప్పదు. ఇదే ఇప్పుడు చాలా మంది నేతలను టెన్షన్ పెట్టేస్తోంది.