Begin typing your search above and press return to search.

బికినీలు వేసుకోవడం ఈ దేశాల్లో నిషేధం

By:  Tupaki Desk   |   29 May 2020 12:30 AM GMT
బికినీలు వేసుకోవడం ఈ దేశాల్లో నిషేధం
X
సినిమాల్లో చూస్తుంటాం.. సొల్లు కార్చుకుంటాం.. ఇన్ స్టాగ్రామ్ లో హీరోయిన్ల 2 పీస్ బికినీలు చూసి ఆగలేకపోతాం.. అరె ఇలాంటి చోటకు ఒక్కసారైన పోయి అస్వాదించాలిరా అని బాధపడుతాం.. కానీ ఈ బికినీ భామలు విదేశాల్లోనే కాదు.. మన ఇండియాలోనూ దర్శనమిస్తారు. చూడాలనుకునే వారికి దేశంలోనే మంచి బికినీ బీచ్ లున్నాయి. బికినీలు వేసుకొని బీచుల్లో తిరిగే సుందరాంగుల ఫొటోలు వీడియోలు విదేశాల్లో కామన్. ఆ అందాలను ఆస్వాదించాలంటే అక్కడికి వెళ్లి తీరాల్సిందేననుకుంటారు. కానీ అన్ని విదేశాల్లోనూ ఈ బికినీలు వేసుకోవడానికి అనుమతులు లేవనే విషయం తెలుసా? కొన్ని దేశాల్లో బికినీలు ధరించడంపై నిషేధం ఉంది. ఆ దేశాలేంటో తెలుసుకుందాం.

* ముస్లిం దేశాల్లో బికినీలు ధరించడం పట్ల నిషేధం ఉంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సముద్ర తీరాల్లో బికినీలు వేసుకునేందుకు అనుమతించరు. కానీ దుబాయ్ బీచ్లో అలాంటి నిషేధం లేదు. కానీ గౌరవప్రదంగా నడుచుకోవాలి. రూల్స్ పాటించాలి.

* స్పెయిన్ దేశంలో రాజధాని నగరంలో వీధుల్లో, ద్వీపాల్లో 2011 నుంచి బికినీ వేసుకొని తిరగడం నిషేధించారు. అతిక్రమిస్తే 500 యూరోలు(39వేల రూపాయలు) జరిమానా విధిస్తారు.

*అందమైన దీవులతో పర్యాటక ప్రదేశంగా ఉన్న మల్దీవులు దేశానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.. ముస్లిం దేశమైన ఇక్కడ పబ్లిక్ బీచ్ లలో బికినీలు ధరించడం నిషేధం. రీసార్ట్ లలో మాత్రం బికినీలకు అనుమతి ఉంది.

*క్రోయేషియాలోనూ నిషేధం
ది ద్వీపంగా పిలవబడే క్రొయేషియా దేశంలో సెలెబ్రెటీలు, ధనవంతులు ఎక్కువగా పర్యటిస్తారు. ఇక్కడ బహిరంగంగా షర్ట్ లేకుండా .. బికినీల్లో తిరగడం నిషేధం. అతిక్రమిస్తే 600 యూరోల (46868 రూపాయలు) వరకు జరిమానా విధిస్తారు.