Begin typing your search above and press return to search.

బంగారంతో స్వీట్స్ , ఎక్కడ తయారుచేస్తున్నారు , ధర చూస్తే షాక్ !

By:  Tupaki Desk   |   31 Oct 2020 12:50 PM GMT
బంగారంతో స్వీట్స్ , ఎక్కడ తయారుచేస్తున్నారు , ధర చూస్తే షాక్ !
X
ఏదైనా ఇంట్లో శుభకార్యం చేసే సమయంలో స్వీట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ స్వీట్స్ తో నోరు తీపి చేసుకొని , ఆ శుభకార్యాన్ని శుభప్రదంగా ముగించుకోవడం మన అలవాటు. అయితే,మీరు ఈసారి మాములు స్వీట్లు కాకుండా మీ ఇంటికి వచ్చిన వ్యక్తులకు బంగారు స్వీట్లు తినిపించండి. అలాంటి ఇలాంటి బంగారం కాదు స్వచ్ఛమైన 24క్యారెట్ల బంగారంతో చేసినవి. అసలు ఈ గోల్డ్ స్వీట్ షాప్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ...

సూరత్ లోని ‘24 క్యారెట్స్ మిఠాయి మ్యాజిక్ అనే స్వీట్ షాపులో పండగల సందర్భంగా ఓ సరికొత్త ఆలోచనకు ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మామూలుగా ఐతే సిల్వర్ పూత కలిగిన స్వీట్లను విక్రయిస్తుంటారు. సిల్వర్ కు బదులు 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ పూత పూసి అమ్ముతున్నారు ఆ స్వీటు షాపు వాళ్లు. దానికి ‘గోల్డ్‌ ఘారీ’ అని పేరు పెట్టింది. శరద్‌ పూర్ణిమ తర్వాతి రోజైన చాందీ పాద్వో రోజున సాంప్రదాయ వంటకం ‘ఘారీ’ తినటం అక్కడి ప్రజల ఆనవాయితీ. దీంతో గుజరాత్‌లోని సూరత్‌ కు చెందిన రోహన్‌ అనే స్వీట్‌ షాపు యజమాని బంగారంతో స్వీటును తయారు చేశాడు. మామూలు ఘారీ కిలో ధర 660-900 రూపాయల వరకు ఉంటే.. కిలో ‘గోల్డ్‌ ఘారీ’ ధర 9000 రూపాయలు.

దీనిపై రోహన్‌ మాట్లాడుతూ.. మేము ఈ సంవత్సరమే ‘ గోల్డ్‌ ఘారీ’ని తయారు చేశాము. ఇది చాలా ఆరోగ్యకరం. బంగారం ఎంతో ఉపయోగకారని మన ఆయుర్వేదమే చెబుతోంది. ఈ స్వీటును మార్కెట్‌ లోకి తెచ్చి మూడురోజులవుతోంది. మేము అనుకున్న దానికంటే తక్కువ డిమాండ్‌ ఉంది. రానున్న రోజుల్లో వ్యాపారం పుంజుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.