రష్యా వ్యాక్సీన్ పై అనుమానాలు.. నమ్మవచ్చా అంటే..

Wed Aug 12 2020 14:40:21 GMT+0530 (IST)

Suspicions over Russia vaccine

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై రష్యా శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేశామని తన కూతురుకు ఈ వ్యాక్సీన్ ఇచ్చామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ టీకాకు 1957లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరిట స్నుత్నిక్-వీ అని పేరు పెట్టారు. ఈ టీకా ప్రపంచానికి ఓ పెద్ద ముందడుగు అని రష్యా చెబుతుంటే తుది విడత పరీక్షలు పూర్తికాకముందే దీనికి అనుమతులు ఇవ్వడంపై దీని భద్రతా ప్రమాణాలపై అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యుహెచ్‌వో గుర్తింపు కూడా రాలేదు. అన్ని దశల్లో దానిని పూర్తిస్థాయిలో పరీక్షించాలని డబ్ల్యుహెచ్‌వో కూడా రష్యాకు సూచించింది.హడావుడిగా టీకాను విడుదల చేయడం ప్రమాదకరమని పలువురు నిపుణులు అంటున్నారు. టీకాలు ఔషధాలకు పట్టె క్లినికల్ ప్రయోగ సమయాన్ని కుదించాలని ఏప్రిల్‌లో పుతిన్ ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సైన్స్ భద్రతను పక్కన పెట్టి ప్రతిష్ట కోసం చూడటం సరికాదని పూర్తి ప్రయోగాలు లేకుండా వ్యాక్సీన్ పంపిణీ చేస్తే సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తి కాలేదని చెబుతున్నారు. ట్రయల్స్ డేటాపై ప్రశ్నిస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్‌ను ఏ మేరకు పరిశీలించారని ప్రశ్నిస్తున్నారు. భద్రత చాలా ముఖ్యమని అమెరికా కూడా పేర్కొంది. మరోవైపు ఈ వ్యాక్సీన్ కు అప్పుడే ఇరవైకి పైగా దేశాల నుండి ఆర్డర్లు వచ్చాయి.

ఇన్ని అనుమానాల మధ్య రష్యాను నమ్మవచ్చుననేది చాలామంది వాదన. అభివృద్ధి చెందిన దేశాల్లో రష్యా ఒకటి. కరోనా ఇక్కడ ఎక్కువగానే ఉంది. కానీ మరీ ప్రమాదకరంగా లేదు. తక్కువ జనాభా కావడంతో రోగ లక్షణాలు ఉన్న అందరికీ వైద్య పరీక్షలు చేయగలిగిన వ్యవస్థ ఉంది. టెస్టింగ్ ట్రేసింగ్ ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించింది. ఇప్పుడు కేసులు ఐదవేల వరకే నమోదు అవుతున్నాయి. వాటిని డీల్ చేయడం రష్యా వైద్యవ్యవస్థకు కష్టమేమీ కాదని ఈ రకంగా చూస్తే రష్యా డమ్మీ వ్యాక్సీన్ తెచ్చి ప్రజల మీద ప్రయోగం చేస్తుందని భావించ లేమని అంటున్నారు.

రోజుకు యాభై వేల కేసులు నమోదవుతున్న అమెరికా వంటి దేశమే విపరీత ప్రయోగాలకు వెళ్లడం లేదని అలాంటప్పుడు నియంత్రించగలికే సామర్థ్యం కలిగిన రష్యా అలాంటి వట్టి ప్రయోగాలతో ప్రజలకు హాని చేస్తుందని భావించలేమని గట్టి నమ్మకం ఉంటేనే వ్యాక్సీన్ ఇవ్వడానికి సిద్ధమైందని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ప్రపంచ దేశాల్లో నమ్మకం పోగొట్టుకునేలా ఓ దేశం ఇంత బహిరంగం గా ఎలా వ్యవహరిస్తుందని కూడా అంటున్నారు.

అంతేకాదు తన కూతురు కు కూడా పుతిన్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఈ వ్యాక్సీన్ ఇచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్‌కు చేరిందని తర్వాత రోజు 37 డిగ్రీలకి చేరిందని రెండోసారి వ్యాక్సీన్ చేసినప్పుడు కూడా అలాగే జరిగింద ని అంతకు మించి ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించ లేదని పుతిన్ స్వయం గా ప్రకటించారు.