Begin typing your search above and press return to search.

కల్తీ శానిటైజర్లతో ప్రాణాలు పోతున్నాయి

By:  Tupaki Desk   |   4 Aug 2020 11:30 AM GMT
కల్తీ శానిటైజర్లతో ప్రాణాలు పోతున్నాయి
X
ఒకప్పుడు జనాలకు అసలు శానిటైజర్ అంటే ఏంటో కూడా తెలియదు.. కరోనా రాకతో దాని విలువ తెలుసొచ్చింది. అయితే విదేశాల్లో, ఆస్పత్రుల్లో మాత్రమే వాడే దీన్ని ఇప్పుడు అందరూ తెగ వాడేస్తున్నారు. శానిటైజర్లకు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు ఈ కల్తీ ముఠాల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో కల్తీ శానిటైజర్ల తయారీ, పంపిణీ, అమ్మకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఇదే పలువురి ప్రాణాలు తీస్తోంది.

రెండు రోజుల కిందట ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 20మంది చనిపోయారు. నిజానికి శానిటైజర్ తాగితే చనిపోరని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది. ఎందుకంటే శానిటైజర్లలో 90శాతం ఇథనాల్ ను కలుపుతారు. ఇదే మద్యంలోనూ ఉంటుంది. దీంతోపాటు ఐసో ప్రొఫైల్ అల్కహాల్ లేదా ఎన్ ప్రొపైల్ అల్కహాల్ ను వినియోగిస్తారు. ఇథనాల్ ను నేరుగా తాగినా ప్రమాదం కాదు.. అది స్వచ్ఛమైన సారాయి లాంటిది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 5 లీటర్ల శానిటైజర్ తయారీకి సుమారు రూ.750 ఖర్చు అవుతుంది. దీంతో శానిటైజర్ తాగితే ఒక విస్కీ తాగినట్టే అనిపిస్తుంది. మరణం సంభవించదు.

కానీ ప్రకాశం జిల్లాలో 20మంది చనిపోవడం వెనుక కల్తీ శానిటైజర్ కారణంగా తేల్చారు. ఈ కల్తీ శానిటైజర్ లో ఇథనాల్ కు బదులుగా మిథనాల్ వాడుతున్నారు.దీని ధర లీటరుకు రూ.10 నుంచి రూ.15వరకు ఉంటుంది.ఈ మిథనాల్ తోనే శానిటైజర్లను తయారు చేస్తున్నారు కల్తీ గ్యాంగులు. 5 లీటర్లకు రూ.100లోపే ఖర్చు అవుతుంది. ప్రజలు తక్కువ ధరకు వచ్చే ఈ శానిటైజర్లను కొంటే అవి ప్రాణాంతకం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొన్ని ప్రముఖ బ్రాండ్లకు నకిలీవి కూడా మిథనాల్ తో తయారు చేసి కొందరు అక్రమార్కులు మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మిథనాల్ చాలా డేంజర్. అది శరీరంలోకి వెళ్తే ఆ వ్యక్తి చావుకు దగ్గరైనట్టే. అది శ్వేధ రంద్రాల ద్వారా శరీరంలోకి వెళుతుంది. అలర్జీ, కంటిచూపు పడిపోతుంది. ఫలితంగా మరణం సంభవిస్తుంది. తక్కువ ధరలో వస్తుంది కదా అని ఏది పడితే అది శానిటైజర్ వాడితే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో 20మంది ప్రాణాలు తీసిన శానిటైజర్ తయారు చేసింది నరసరావుపేట సమీపంలోని ఓ నకిలీ ఫ్యాక్టరీలో అని నిఘావర్గాలు తెలుసుకున్నాయి. నాసిరకం స్పిరిట్ వినియోగించి ఈ శానిటైజర్ తయారు చేశారు. ఇది తాగి 20మంది చనిపోయారు. నిజానికి ఇథనాల్ తో తయారు చేస్తే తాగినా ఏం ప్రమాదం కాదు. ఇలా వ్యాపారుల కక్కుర్తి వల్ల 20మంది ప్రాణాలు కోల్పోయారు.