భార్య ను భర్త కొట్టడం కరెక్టయినా .. ఆ సర్వే షాకింగ్ రిపోర్ట్ ?

Sun Nov 28 2021 06:00:01 GMT+0530 (IST)

Survey Shocking Report

ప్రపంచ వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గృహ హింస కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దేశంలోని చాలా గ్రామాల్లో అయితే ఇప్పటికీ భర్తలు ఫుల్ గా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను కొడుతుంటారు. కారణం లేకపోయినా కూడా భార్యను కొట్టడం కొందరి మొగుళ్లకు సరదాగా మారింది కూడా. అయితే భార్యను కొట్టడం తమ హక్కు అని భర్తలు భావిస్తుండగా మహిళలు కూడా అదే నిజమని నమ్మతున్నట్లు తాజాగా ఓ సర్వేలో తేలింది.మీ ఉద్దేశ్యంలో భార్యను..భర్త కొట్టడం కరక్టేనా అందుకు ఆయనను సమర్థించవచ్చా అనే ప్రశ్నలతో 2019-21 మధ్య నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే ఐదో ఎడిషన్ సర్వే నిర్వహించింది. రెండు విడతలుగా ఈ సర్వే వివరాలు వెల్లడయ్యాయి. తొలి విడత గణాంకాలను గతేడాది డిసెంబర్ లో విడుదల చేయగా..రెండో విడత గణాంకాలను తాజాగా విడుదల చేశారు. 18 రాష్ట్రాలుజమ్మూకశ్మీర్ లో ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ నిర్వహించిన సర్వేలో మెజార్టీ మహిళలు భార్యను భర్త కొట్టడం కరక్టేనని చెప్పారు. అత్యధికంగా తెలంగాణలో 83.8శాతం మంది మహిళలు దీన్ని ఒప్పుకున్నారని సర్వే తెలిపింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 83.6శాతంకర్ణాటకలో 76.9శాతంమణిపూర్ లో 65.9శాతంకేరళలో 52.4శాతం మంది మహిళలు భర్తలు కొట్టడంలో తప్పులేదని చెప్పారు.

అత్యంత తక్కువగా హిమాచల్ ప్రదేశ్ లో కేవలం 14.8శాతం మంది మహిళలే దీన్ని అంగీకరించినట్లు సర్వే తెలిపింది. శృంగారానికి నిరాకరించడంవంట సరిగ్గా చేయకపోవడంఅత్తమామలకు గౌరవం ఇవ్వకపోవడంభర్తకు చెప్పకుండా భార్య బయటకు వెళ్లడంపిల్లలు మరియు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం అనే కారణాలతో భర్త తమను కొడుతున్నట్లు మెజార్టీ మహిళలు సర్వేలో తెలిపారు. ఇందులో ప్రధానంగా అత్తమామలకు గౌరవం ఇవ్వట్లేదనే కారణంతోనే ఎక్కువమంది మహిళలపై దాడులు జరుగుతున్నట్లు సర్వే తెలిపింది.ఇకభార్యలపై ఈ ప్రవర్తన ను సమర్థించుకుంటున్నారా అని పురుషులను ప్రశ్నించగా…అత్యధికంగా కర్ణాటకలో 81.9శాతం మంది అవుననే సమాధానమిచ్చారు. మరోవైపుమొబైల్ ఫోన్ల వినియోగంలో మహిళల సంఖ్య పెరిగిందని సర్వే తెలిపింది. అదేవిధంగాదేశంలో సంతాన సాఫల్యత రేటు 2కి పడిపోయిందని తెలిపింది.