Begin typing your search above and press return to search.

గ్రేటర్ ఫలితంపై కేసీఆర్ చేతికి నిఘా నివేదిక?

By:  Tupaki Desk   |   26 Nov 2020 7:50 AM GMT
గ్రేటర్ ఫలితంపై కేసీఆర్ చేతికి నిఘా నివేదిక?
X
మిగిలిన ముఖ్యమంత్రులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న పెద్ద వ్యత్యాసం ఏమంటే.. అందుబాటులో ఉన్న నిఘా విభాగాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవచ్చన్న విషయాన్ని మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తాను అధికారం చేపట్టిన నాటి నుంచే ‘నిఘా’ విభాగానని ఎఫెక్టివ్ గా వినియోగించుకునే విషయంలో ఆయనకు ఆయనే సాటి అంటారు.

ప్రభుత్వానికి సంబంధించిన బోలెడన్ని విషయాల్ని ఈ విభాగం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని చెబుతారు. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో ఏయే పార్టీలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని.. ప్రతి రెండు రోజులకోసారి నివేదిక ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ లో బీజేపీ బలపడుతోందన్న మాట పలువురి నోట వినిపిస్తున్న వేళ.. తాజాగా కేసీఆర్ చేతికి అందిన నివేదికలోనూ బీజేపీ బలాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నారు.

గతంతో పోలిస్తే.. గ్రేటర్ లో బీజేపీ బలం పెరిగిందని.. గత ఎన్నికల (2016) మాదిరి గెలుపు కేక్ వాక్ కాదన్న విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 99 సీట్ల సాధన.. సెంచరీ దాటేసే పరిస్థితి లేదని పేర్కొన్నట్లు చెబుతున్నారు. నిఘా విభాగం అంచనా ప్రకారం.. కనిష్ఠంగా 25 గరిష్ఠంగా 32 డివిజన్లను బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. కాకుంటే.. బండి సంజయ్ నోటి నుంచి వచ్చిన సర్జికల్ స్ట్రైక్స్ మాటతో బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని.. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అలాంటి వ్యాఖ్యల్ని అస్సలు ఇష్టపడటం లేదన్న మాట నిఘా వర్గాలు తెలిపినట్లుగా చెబుతున్నారు.