స్టార్ హీరో ఆ భారీ చిత్రాన్ని పక్కకు పెట్టాడట!

Sun Jul 05 2020 11:47:13 GMT+0530 (IST)

Suriya On about his Upcoming Movie Budget

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుత పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే ఈ చిత్రంను విడుదల చేసే అవకాశం ఉంది. ఆ సినిమా తర్వాత హరి దర్శకత్వంలో ‘అరువా’ అనే భారీ యాక్షన్ చిత్రాన్ని చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని వార్తలు వచ్చాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది అనుకుంటున్న సమయంలో సూర్య ఆ సినిమాను పక్కకు పెట్టినట్లుగా తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.సూర్య ఆ సినిమాను పక్కకు పెట్టి వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడట. జల్లికట్టు నేపథ్యంలో సాగే ఆ చిత్రంలో సూర్య నటించబోతున్నాడు. విభిన్నమైన కథాంశంతో వెట్రిమారన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మీడియం రేంజ్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని కళ్లై పులి ఎస్ థాను నిర్మించబోతున్నాడు.

జీవి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. ఆకాశమే నీ హద్దురా చిత్రం బ్యాలన్స్ వర్క్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. వెట్రి మారన్ చిత్రం తర్వాత హరి దర్శకత్వంలో సూర్య ఆ భారీ చిత్రం చేస్తాడా లేదంటే అది ఇక అంతేనా అనేది చూడాలి.