Begin typing your search above and press return to search.

మోదీ సొంత రాష్ట్రంలో దారుణం..లేడీ డాక్టర్ పై ఇంటి ఓనర్ దౌర్జన్యం

By:  Tupaki Desk   |   6 April 2020 1:37 PM GMT
మోదీ సొంత రాష్ట్రంలో దారుణం..లేడీ డాక్టర్ పై ఇంటి ఓనర్ దౌర్జన్యం
X
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ నేపథ్యంలో వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు నిజంగానే రక్షణ లేకుండా పోయింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు చికిత్సలు అందిస్తున్నా... వారి గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని కొందరు వ్యక్తలులు వారిపై విరుచుకుపడుతున్న వైనం పలుచోట్ల బయటపడుతోంది. ఈ క్రమంలో వైద్యుల రక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలు సైతం బేఖాతరు అవుతున్నాయి. ఇలాంటి ఘటన స్వయంగా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. లేడీ డాక్టర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డ ఓ ఇంటి ఓనర్ పై మోదీ సర్కారు అయినా, గుజరాత్ లోని బీజేపీ సర్కారు అయినా ఏ విధమైన చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇక సదరు ఘటన వివరాల్లోకి వెళితే... గుజరాత్ లోని సూరత్ సివిల్ హాస్పిటల్ లో ఓ మహిళా డాక్టర్ విధులు నిర్వహిస్తున్నారు. ఈమె నివాసం ఉంటున్న వ్యక్తి ఆమెపై దురుసుగా ప్రవర్తించాడు. తిట్ల పురాణం అందుకున్నాడు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆమె వల్ల తమకు కరోనా వైరస్ సోకుతుందని ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు. అయితే సంయమనం కోల్పోని సదరు వైద్యురాలు ఈ ఘటన మొత్తాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీశారు. దీనిని చూసిన ఆ వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. సెల్ ఫోన్ గుంజుకొనేందుకు, దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇంట్లోని వారు ఆపేందుకు ప్రయత్నించినా అతను వినిపించుకొనే స్థితిలో కనిపించలేదు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. అతనిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ కాగానే అది వైరల్ అయిపోయింది. కోవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్న మహిళా వైద్యురాలిపై సదరు వ్యక్తి విరుచుకుపడిన తీరుపై సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. ఈ వీడియోను చూసిన వెంటనే దీనిపై కాంగ్రెస్ నేత శ్రీవత్స రెస్పాండ్ అయ్యారు. ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఇంటి ఓనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని ఆయన కోరారు. పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ లభించక ఇబ్బందులు పడుతున్న వైద్యులు.. ఇప్పుడు సమాజంలో కూడా ఒంటరి కావాల్సి వస్తుందని ఆయన తెలిపారు. మోదీ సొంత రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.