మోడల్ కు తగ్గని అందం..నమ్మితే ముంచేస్తుంది!

Sun Aug 09 2020 11:00:02 GMT+0530 (IST)

Supriya Swain alias Deepa Cheat People

చూసినంతనే మోడల్ కు ఏ మాత్రం తగ్గని అందం.. ఫిగరుతో ఉన్న ఈ అమ్మాయి బాగా చదువుకున్న సంపన్న యువతిలా కనిపిస్తుంటుంది. స్నేహం పేరుతో వల విసిరి.. అందులో పడిన వారికి మంచిగా ఉన్నట్లే నటిస్తూ.. డబ్బుల్ని దోచేసే దరిద్రపుగొట్టు తీరు ఈమె సొంతం. వరుస పెట్టి మోసాలు చేస్తున్న ఈ కిలేడీని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.ఈమె బాధితుల ఖాతాలో ఒక రిటైర్డు హోమియో వైద్యుడితో పాటు.. మరో వ్యాపారి ఉండటం గమనార్హం. ఇంతకీ ఈ మాయలేడీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒడిశా లోని మజికాసాహి ప్రాంతానికి చెందిన సుప్రియా తన పేరును దీపా అని మార్చుకుంది. ప్రజల్ని మోసగించటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈమె.. కొత్త పరిచయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. అమెను చూసి నమ్మితే చాలు..నట్టేట మునిగిపోవటం ఖాయం.

అలానే.. తాను ఉండే ప్రాంతానికి దూరంగా ఉండే థెంకనాల్ జిల్లాలోని పర్జాంగ్ బ్లాక్ కు చేరుకున్న ఆమె ఒక రిటైర్డు హోమియో వైద్యుడ్ని పరిచయం చేసుకున్నది. ఆమెను పూర్తిగా నమ్మిన ఆ వైద్యుడి వద్ద ఉన్న పాలసీలో మెచ్చూరిటీ డబ్బును ఒకేసారి తీసుకోవచ్చని ఆశ రేపింది. సదరు పెద్ద మనిషి వద్ద నుంచి బ్యాంకు ఖాతా వివరాలు.. పాలసీ వివరాల్ని సేకరించిన ఆమె.. వాయిదాల పద్దతిలో రూ.4.57లక్షలు డ్రా చేసి జంప్ అయ్యింది. ఇదే రీతిలో మరోవ్యాపారిని సైతం ముంచేసింది.

తొలుత పరిచయం.. తర్వాత మంచి మాటలతో వారికి తన మీద నమ్మకం కలిగేలా చేయటం ఈ కిలేడీ దిట్ట. పూర్తిగా నమ్మిన తర్వాత.. చదువుకున్న అమ్మాయిలా ఉండే ఆమెను సాయం అడిగినంతనే చేసి పెడతానని చెప్పి.. వారిని మోసం చేసి డబ్బుల్ని డ్రా చేస్తుంది.సదరు వ్యాపారి నుంచి కూడా ఇదే రీతిలో దగ్గర దగ్గర రూ.1.5లక్షల వరకు కాజేసింది. తర్వాత ఊడాయించింది. తాము మోసపోయిన విషయాన్ని గుర్తించి ఈ ఇద్దరు బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కిలేడీని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.