20 ఏళ్ల క్రితం రేప్ కేసు.. సుప్రీం కీలక తీర్పులు

Tue Sep 29 2020 23:20:24 GMT+0530 (IST)

Rape case 20 years ago .. Supreme key judgments

20 ఏళ్ల క్రితం నాటి అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. నిందితుడిని నిర్ధోషిగా ప్రకటించింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు బాధితురాలు గతంలో ప్రేమలో ఉన్నారనే ఆధారాలతో ఈ కీలక తీర్పునిచ్చింది.తనను కాదని మరో మహిళను వివాహం చేసుకుంటున్నాడనే కోపంతో బాధితురాలు అత్యాచార ఆరోపణలు చేసిందని కోర్టు వెల్లడించింది. కొంత కాలం ప్రేమలో ఉన్న వ్యక్తుల మధ్య అభిప్రాయబేధాలు వస్తే ఆ సమయంలో లైంగిక కలవడాన్ని అత్యాచారం కింద పరిగణించలేదని తెలిపింది.

అందుకే ఈ కేసుపై పునరాలోచన చేసి తాజాగా 20 ఏళ్లకు తీర్పునిచ్చినట్టు పేర్కొంది. 1995 వీరిద్దరూ ప్రేమించుకున్నారని.. 1999లో కేసు నమోదైంది.

కాగా ఇదే కేసులో ట్రయల్ కోర్టు జార్ఞండ్ హైకోర్టు నిందితుడిని దోషిగా తీర్పును ఇచ్చింది. దీంతో అతడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఇరువురు రాసుకున్న లేఖలతోపాటు వారు దిగిన ఫొటోలను చూడడం ద్వారా ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు అర్థం అవుతోందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అందుకే నిర్ధోషిగా విడుదల చేస్తున్నట్టు తెలిపింది.