Begin typing your search above and press return to search.

కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి వద్దు .. కేంద్రానికి సుప్రీం వార్నింగ్ !

By:  Tupaki Desk   |   7 May 2021 1:30 PM GMT
కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి వద్దు .. కేంద్రానికి సుప్రీం వార్నింగ్ !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం కొనసాగుతుంది. సెకండ్ వేవ్ లో ఎక్కువగా వైరస్ శ్వాసకోసలపై ప్రభావం చూపిస్తుండటం తో కరోనా భారిన పడిన ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉంది. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టు కేంద్రానికి పలు ఆదేశాలు కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా అవసరమైన మేర జరిగేలా చూడాలంటూ ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే , ఆ మేర కేంద్రం ఆక్సిజన్ అందివ్వలేక పోవడంతో ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కేంద్రానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

కరోనా మహమ్మారితో అల్లాడుతున్న ఢిల్లీకి ప్రతి రోజు 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి తాము తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు ఆక్సిజన్ సరఫరాను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మాకు తగినంత ఆక్సిజన్ సరఫరా వస్తే, ఢిల్లీలో 9,000 నుండి 9,500 పడకలను ఏర్పాటు చేయగలుగుతామని కోర్టుకు తెలుపగా , సుప్రీం కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. తాము కఠిన చర్యలు తీసుకునే పరిస్థితిని రానివ్వొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి రాష్ట్రానికి సరఫరా అవుతున్న ఆక్సిజన్ పై ఎక్స్ పర్ట్ ప్యానల్ ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎంతో మంది జీవితాలను కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొంది.