Begin typing your search above and press return to search.

సెక్షన్ 66ఏ వినియోగంపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసు

By:  Tupaki Desk   |   2 Aug 2021 3:30 PM GMT
సెక్షన్ 66ఏ వినియోగంపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసు
X
రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఏ సెక్షన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఇటీవలే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడో సుప్రీం రద్దు చేసిన ఐటీ చట్టాన్ని ఇంకా పోలీసులు పౌరులపై పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరంలో రూపొందించిన ఆ చట్టం ప్రకారం ఇప్పటికీ కొన్ని కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తున్నట్టు 2015 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పోలీసుసిబ్బందికి సమాచారం ఇవ్వాలని 2019లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇంకా పలు చోట్లు కేసులు నమోదు కావడం ఇది చాలా దారుణమైన పరిణామం అని అభివర్ణించింది. దీనిపైనే ఇవాళ విచారణ చేపట్టింది.దీనికి సమాధానం ఇవ్వాలంటూ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని 66ఏ సెక్షన్ వినియోగాన్ని కొనసాగిస్తుండడంపై సమాధానం ఇవ్వాలంటూ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సోమవారం తాజాగా నోటీసులు ఇచ్చింది. ఐటీచట్టంలోని సెక్షన్ 66ఏను కొట్టివేసినప్పటికీ దీనిని కొనసాగిస్తుండడంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (ఎన్.జీఓ) పిటీషన్ దాఖలు చేసింది.

దీనిపై సుప్రీంకోర్టు తాజాగా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. రద్దు చేసిన 66ఏపై తాము సమగ్ర ఉత్తర్వులు ఇవ్వగానే అన్ని వ్యవహారాలు ఒకేసారి సెటిల్ అవుతాయని ధర్మాసనం పేర్కొంది.

రద్దు చేసిన సెక్షన్ ను కేవలం పోలీసులు స్టేషన్లలో మాత్రమే కాకుండా దేశంలోని ట్రయల్ కోర్టుల్లోనూ కొనసాగిస్తున్నారంటూ పిటీషనర్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

దీనిపై ధర్మాసనం స్పందించింది. జ్యూడిషియరీగా తాము ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని.. అయితే పోలీసులు కూడా ఇందులో ఉన్నందున రద్దైన సెక్షన్ కొనసాగించకుండా సరైన ఉత్తర్వులిస్తామని పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.