Begin typing your search above and press return to search.

ఏపీ బీహార్ రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం.. సీఎస్ కు పిలుపు

By:  Tupaki Desk   |   19 Jan 2022 8:06 AM GMT
ఏపీ బీహార్ రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం.. సీఎస్ కు పిలుపు
X
కరోనా పరిహారం చెల్లింపులో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ తోపాటు బీహార్ సీఎస్ కు కూడా సమన్లుజారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల్లోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

కోవిడ్ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎంఆర్ షా, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఇరు రాష్ట్రాల సీఎస్ లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. వారు చట్టానికి అతీతులు కాదని హితవు పలికింది.

కోవిడ్ తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా పరిహారం చెల్లింపు కోసం మార్గదర్శకాలను రూపొందించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్.డీఎంఏ)ని జూన్ 30, 2021న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎక్స్ గ్రేషియా సాయంగా అందించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే బాధ్యతను ఎన్డీఎంఏ విజ్ఞతకే వదిలివేసింది కోర్టు.

అనంతరం కోవిడ్19 మృతుల కుటుంబాలకు రూ.50000 నష్టపరిహారం చెల్లించాలని సిఫారసు చేసినట్లు పేర్కొంటూ కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది.

మరణించిన వారి బంధువులకు రూ.50వేలు చెల్లించాలని కేంద్రం చేసిన సిఫార్సును కోర్టు అక్టోబర్ 2021లో ఆమోదించింది. అయితే పరిహారం చెల్లింపులో జాప్యంతో సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు తక్షణం సుప్రీంకోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఏపీ, బీహార్ సీఎస్ లకు ఆదేశించింది.