Begin typing your search above and press return to search.

ఏపీ నూత‌న డీజీపీగా సునీల్ కుమార్‌.. సంచ‌ల‌న ఆదేశాలు సిద్ధం?

By:  Tupaki Desk   |   30 Jan 2023 1:50 PM GMT
ఏపీ నూత‌న డీజీపీగా సునీల్ కుమార్‌.. సంచ‌ల‌న ఆదేశాలు సిద్ధం?
X
ఏపీలో అనుకున్న‌దే జ‌రిగింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో ప‌నిచేశార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న సీఐడీ మాజీ చీఫ్‌.. సునీల్ కుమార్ విష‌యంలో తాజాగా తాడేప‌ల్లి వ‌ర్గాలు సంచ‌ల‌న వార్త‌ల‌ను లీకు చేశాయి. ఈ రోజు లేదా రేప‌ట్లో.. ఆయ‌న‌ను రాష్ట్ర డీజీపీగా ప్ర‌క‌టించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంద‌ని తెలిపాయి. ఇటీవ‌ల‌.. అనూహ్యంగా సునీల్ కుమార్‌ను సీఐడీ విభాగం నుంచి త‌ప్పిస్తూ.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే, దీనిపై అనేక ఊహాగానాలు వ‌చ్చాయి. ఆయ‌న ప‌నితీరుపై జ‌గ‌న్ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నార ని.. అందుకే ఆయ‌న‌ను త‌ప్పించార‌ని పేర్కొన్నాయి. అంతేకాదు.. జ‌రిగిన బ‌దిలీతీరు కూడా అలానే సాగింది. రాత్రికి రాత్రి.. అనూహ్యంగా సునీల్‌కుమార్‌ను సీఐడీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. ఆ వెంట‌నే ఆయ‌న‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వ‌కుండానే ప‌క్క‌న పెట్టి.. డీజీపీ కార్యాల‌యంలో రిపోర్టు చేయాల‌ని సూచించారు. దీంతో సునీల్‌కు సీఎంకు మ‌ధ్య చెడింద‌ని స‌హ‌జంగానే ఓ వ‌ర్గం ప్ర‌చారం చేసింది.

కానీ, తాజాగా తాడేప‌ల్లి వ‌ర్గాలు మీడియాకు ఇచ్చిన లీకుల ప్ర‌కారం.. సునీల్ కుమార్‌ను డీజీపీగా నియ‌మిం చనున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం డీజీపీగా ఉన్న క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై సీఎంజ‌గ‌న్ కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారు. సొంత జిల్లాకు చెందిన అధికారి కావ‌డంతో బ‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేయించ‌క పోయినా.. ఆయ‌న‌ను త‌ప్పించాల‌ని చూస్తున్నార‌ని కొన్నిరోజులుగా చ‌ర్చ అయితే న‌డుస్తోంది.

టీడీపీ దూకుడు.. జ‌న‌సేనాని ఫైర్‌ను నియంత్రించ‌డంలో ప్ర‌స్తుత డీజీపీ విఫ‌ల‌మ‌య్యార‌నివైసీపీ నాయ‌కు లు కూడా అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో పేర్కొంటున్నారు. పైగా ఎన్నిక‌ల సీజ‌న్ కూడా వ‌చ్చేయ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి అనుకూలంగా ప్ర‌తిప‌క్షాల‌పై ఉక్కుపాదం మోప‌గ‌లిగే అధికారి అవ‌స‌ర‌మ‌ని కూడా నాయ‌కులు చెబుతూఊ వ‌స్తున్నారు. ఈ క్ర‌మ‌లోనే తాజాగా సునీల్ కుమార్‌ను డీజీపీగా నియ‌మించ‌నున్నార‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూరుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.