Begin typing your search above and press return to search.

సుజనా ఆర్తనాదం.. వినపడట్లేదా.?

By:  Tupaki Desk   |   11 Sep 2019 10:28 AM GMT
సుజనా ఆర్తనాదం.. వినపడట్లేదా.?
X
కాలు కాలిన పిల్లి ఎలాగైతే గిలగిలలాడుతుందో ఇప్పుడు అమరావతి రాజధానిపై పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు అలానే కొట్టుకుంటున్నారు. కక్కలేక మింగలేక నానా డ్రామాలు ఆడుతున్నారన్న చర్చ వైసీపీలో సాగుతోంది.. ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతి రాజధాని కేంద్రంగా టీడీపీ బినామీలు కొన్న భూములు - పట్టిన ప్రాజెక్టులను నిగ్గుతేల్చి వైసీపీ ప్రభుత్వం వాటిపై కఠినంగా ముందుకెళుతోంది.

ఈ నేపథ్యంలో టీడీపీకి ఆర్థిక వెన్నుదన్నుగా ఉండి.. ఇప్పుడు బీజేపీలో చేరిపోయిన రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి అమరావతిని మార్చవద్దంటూ కొత్త నాటకం మొదలు పెట్టడంపై వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి..

బుధవారం సుజనచౌదరి నేతృత్వంలో రాజధాని రైతులు - కొంతమంది నేతలు కలిసి ఏపీ గవర్నర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని మార్చడానికి ప్రయత్నిస్తోందని.. దీనివల్ల తాము నష్టపోతామని గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చారు. రాజధాని మార్పు చేయకుండా చూడాలని రాజధాని రైతులను బూచీగా చూపి గవర్నర్ ను వేడుకున్నారు.

అయితే ప్రస్తుతం టీడీపీ అన్న చంద్రబాబు అన్న కేంద్రంలోని బీజేపీ పెద్దలకు పడడం లేదు. మోడీని గద్దెదించడానికి చంద్రబాబు వేసిన ప్లాన్లు అన్నీ ఇన్నీ కావు.. అలాంటి చంద్రబాబు పోరాటానికి మద్దతుగా బీజేపీలో ఉంటూ పోరాడుతున్న సుజనాచౌదరి వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీలోకి మారినా తన బాస్ చంద్రబాబుకు, తనకు ముప్పుగా పరిగణించిన అమరావతి మార్పు విషయంలో ఏకంగా వైసీపీపైనే పోరుబాటుకు సుజనాచౌదరి దిగడం విశేషంగా మారింది. బీజేపీలో ఉంటూ టీడీపీకి సపోర్టుగా రాజకీయం చేస్తున్న సుజనా వ్యవహారం ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఓ కంట కనిపెడుతున్నారట..