Begin typing your search above and press return to search.

సుజన ప్లాన్ వర్కవుట్ కాలేదా?

By:  Tupaki Desk   |   20 Feb 2020 3:21 PM GMT
సుజన ప్లాన్ వర్కవుట్ కాలేదా?
X
బీజేపీ వలస నేత సుజన చౌదరికి గట్టి షాక్ తగిలింది. బయట ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం ఆయన పార్టీ మారినా ఫలితం దక్కలేనట్టుంది. కొన్ని నెలల క్రితం సుజనా చౌదరి తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిపోయారు. వ్యాపార నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సుజన చౌదరికి దేశ విదేశాల్లో అనేక కంపెనీలు ఉన్నాయి. ఆయన కంపెనీల్లో అత్యధికం ఆయన పేరుమీదనే ఉన్నాయి. ప్రతి కంపెనీకి బ్యాంకులోన్లు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలకు బ్యాంకు రుణాలు ఉండటం అనేది సర్వసాధారణం. కానీ వాటిని కట్టకుండా వార్తల్లోకి ఎక్కే కొందరిలో సుజన చౌదరి ఒకరు. ఆయన బీజేపీలో చేరినపుడు రుణాల ఎగవేతకు, ఈడీ దాడుల నుంచి రక్షించుకోవడానికే చేరారని అందరూ సోషల్ మీడియాల్లో సెటైర్లు వేశారు. జీవీఎల్ వంటి బీజేపీ నేతలు కొందరు ఆప్రచారానికి స్పందిస్తూ... పార్టీలోకి చేరినంత మాత్రాన తప్పుల నుంచి తప్పించుకోలేరు అంటూ వ్యాఖ్యానించారు కూడా. అదే నిజమైంది. ఈరోజు సుజన ఆస్తులు వేలం వేస్తున్నట్లు పేపర్లో ప్రకటన వచ్చింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సుజనకు చెందిన సుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీ సుమారు 400 రుణ బకాయిల చెల్లింపులు చేయకపోవడంతో ఆ అప్పుకోసం తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై కార్పరేట్ బ్రాంచి తరఫున పేపర్లో వేలం ప్రకటన వచ్చింది. ఆ రుణం కోసం హామీ ఇచ్చిన గ్యారంటీర్లకు కూడా ఇదే బహిరంగ నోటీసు అంటూ బ్యాంకు పేర్కొంది. హైదరాబాదులోని నాగార్జున హిల్స్ ఉన్న ఈ కంపెనీకి రుణం కోసం సుజనా చౌదరితో పాటు పలువురు గ్యారంటీర్లుగా ఉన్నారు. గ్యారంటీర్లలో వై.శివలింగ ప్రసాద్ (లేట్) - వై.జితిన్ కుమార్ - వై.శివరామకృష్ణ. ఎస్టీ ప్రసాద్ - గొట్టుముక్కల శ్రీనివాసరాజు - స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ - సుజనా కేపిటల్ సర్వీసెస్ - సుజనా పంప్స్ అండ్ మోటార్స్ - నియోన్ టవర్స్ - సార్క్ నెట్ లిమిటెడ్ సంస్తల పేర్లను బ్యాంక్ వెల్లడించింది. ఈ ఆస్తుల వేలం ప్రకియ మార్చి 23వ తేదీన జరగనుంది. అంతలోపు రుణంలో మెజారిటీ కట్టినా కూడా ఈ వేలం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. మరి సుజనా కంపెనీ ఆ పని చేస్తుందో లేదో తెలియదు.

సుజన చౌదరి కేవలం భారతదేశంలోనే కాదు - సింగపూర్ వంటి అత్యంత క్రమశిక్షణాయుత దేశాల్లోను కంపెనీలు పెట్టి అక్కడ కూడా రుణాలు తీసుకున్నారు. ఇలా సుమారు వందకు పైగా కంపెనీలు పెట్టి సుజనా వేలకోట్ల రుణాలు పొందారు. వాటి సంగతి ఏమో గాని ఈ తాజా వేలంతో అమరావతిపై శాసనాలు చేస్తున్న సుజనాపై వైసీపీ - టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.