అంత పెద్ద దాతృత్వరాలివి అయ్యిండి ఇదేం పనమ్మా.. సుధామూర్తిపై నెటిజన్ల ఫైర్

Tue Sep 27 2022 21:57:36 GMT+0530 (India Standard Time)

Sudhamurthy planted at the feet of Queen of Mysore

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నారాయణ మూర్తి భార్య అయిన సుధా మూర్తి వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.  సుధామూర్తి మైసూరు రాజ కుటుంబానికి చెందిన ప్రమోదా దేవి వడియార్ కాళ్లకు నమస్కరిస్తున్నట్లు ఉన్న ఫొటో దుమారం రేపింది. నటి బి. సరోజాదేవిని కూడా మనం ఫొటోలో కనిపిస్తోంది. మైసూర్ రాష్ట్ర చివరి పాలకుడు జయచామరాజ వడియార్ జన్మ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావడానికి సుధామూర్తిని ఆహ్వానించినప్పుడు ఈ ఫొటో తీసినట్టు ఉంది. ఇది 2019 నాటిది. ప్రమోదా దేవి వడియార్ దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ భార్య. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు సుధామూర్తి తీరును విమర్శిస్తున్నారు. ఈ ఆధునిక యుగంలో రాజకుటుంబానికి నమస్కరించే పద్ధతిని విమర్శించారు.  మరికొందరు ఇది కేవలం గౌరవం చూపించే విధానం అని అన్నారు.ఫోటోను పోస్ట్ చేస్తూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.  “సుధా మూర్తి మైసూర్ రాజకుటుంబ సభ్యుల ముందు నమస్కరిస్తున్నారు. ఆమె రోల్ మోడల్‌గా ఇన్నాళ్లు ఉన్నారు. భారతదేశంలోని రాజకుటుంబ సభ్యులను పలకరించే సంప్రదాయం ఇదేనా? అది ఆమెకు గౌరవమా? గౌరవం కోసం చేసిన చర్యలా ఉందా?’ అంటూ మండిపడ్డారు.   “మైసూర్ రాజకుటుంబానికి చెందిన సభ్యుని ముందు సుధా మూర్తి నమస్కరిస్తున్నట్లు చూడండి. ఆమె ఒక రోల్ మోడల్‌గా ఉండాలి. ”అంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు.  

సుధామూర్తి చేసిన పనిని చాలామంది ఆమోదించలేదు. “శ్రీమతి సుధా మూర్తి అంటే నాకు చాలా గౌరవం. ఆమె పుస్తకాలు చాలా మంది స్త్రీలను తలెత్తుకు తిరగడానికి.. ముందుకు సాగడానికి ప్రేరేపించాయి. రాజకుటుంబానికి ఆమె సాష్టాంగం చేయడం ఒక భావోద్వేగ వ్యక్తీకరణ. ఆమె మైసూర్ రాజకుటుంబం కంటే ఎక్కువ రాచరికాన్ని కలిగి ఉన్నారు. ఇలా చేయకూడదు" అని కొందరు హితవు పలికారు.
 
అయితేఅది ఆమె వ్యక్తిగత గౌరవం అయితే ఎవరూ ప్రశ్నించలేరు. రాజకుటుంబం చేసే దాతృత్వం లేదా ఇతర మంచి పని నుండి ప్రయోజనం పొందే ఎవరైనా దీన్ని చేస్తే అది చెల్లుబాటు అవుతుంది. కానీ సుధా మూర్తి వంటి గొప్ప సాధకురాలు ఇలా చేయడం అందరికీ నచ్చకపోవచ్చు అని ఆమె సన్నిహితులు సమర్థించారు.  

ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ భార్యగానే కాకుండా రచయిత్రిగా విద్యావేత్తగా మరియు పరోపకారిగా సుధా మూర్తి వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందారు.. తన భర్త మరియు ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తితో కలిసి ఆమె 1996లో  లాభాపేక్ష లేని ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ఆరోగ్య సంరక్షణ గ్రామీణాభివృద్ధి మరియు విద్య రంగాలలో కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది. ఈ ఫౌండేషన్ ను సుధామూర్తి దగ్గరుండి నిర్వహిస్తూ దేశంలో ఎంతో మందికి సేవ చేస్తున్నారు. ఆమె అలా ఓ రాజకుటుంబానికి నమస్కరించడం చాలా మందికి నచ్చలేదు.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.