Begin typing your search above and press return to search.

సబ్ మెరైన్ మిస్సింగ్..ఆ 53 మంది సిబ్బంది ఇక..?

By:  Tupaki Desk   |   22 April 2021 5:30 AM GMT
సబ్ మెరైన్ మిస్సింగ్..ఆ  53 మంది సిబ్బంది ఇక..?
X
జలాంతర్గామి .. సబ్ మెరైన్ ... దేశ భద్రత లో కీలక పాత్ర వహించే ఓ కీలకమైన ఆయుధం. జల మార్గం ద్వారా దేశానికీ వచ్చే పెను ముప్పుని ఎదుర్కొంటూ రోజుల తరబడి నీటిలో ప్రయాణం కొనసాగిస్తుంది సబ్ మెరైన్. అలాగే అందులో ఉన్న సిబ్బంది కూడా ఒక్కసారి డ్యూటీ లో జాయిన్ అయితే, ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తీ అయ్యి బయటకి వచ్చేవరకు వారికి , వారి ప్రాణాలకి భద్రత ఉండదు. నీటి లోపల ఏమైనా జరగొచ్చు. ఇదిలా ఉంటే .. హిందూ మహా సముద్రంలో ఇండోనేషియాకు చెందిన జలాంతర్గామి (German-made submarine, KRI Nanggala-402) సిగ్నల్స్ కోల్పోయింది. ఈ జలాంతర్గామిలో 53 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. జలాంతర్గామి, ఇండోనేషియాలోని బాలీ తీరంలో ప్రయాణిస్తుండగా సంబంధాలు తెగిపోయిన్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ మెరైన్ గాలింపు కోసం, ఇండోనేషియా ప్రభుత్వం సింగపూర్‌, ఆస్ట్రేలియా సాయం కోరింది.

వివరాల్లోకి వెళ్తే .. ఇండోనేషియా ఉత్తర భాగంలోని బాలీ వద్ద ఈ సబ్ మెరైన్ నుండి కనెక్షన్ తప్పిపోయింది. అక్కడ నిర్వహిస్తున్న టర్పడో డ్రిల్ నిర్వహిస్తున్న సమయంలో ఇది అదృశ్యం అయిందని నేవీ అధికారి ఒకరు రీయూటర్స్ కు తెలిపారు. ఇండోనేషియా మిలటరీ చీఫ్ హాది తజాంటు మాట్లాడుతూ.. ఈ సబ్ మెరైన్ బుధవారం ఉదయం 4;30 గంటల స్థానిక సమయంలో మిస్ అయిందని చెప్పారు. మేం ఇప్పటికీ ఆ సబ్ మెరైన్ జాడ కోసం వెతుకుతూనే ఉన్నాం. బాలి నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సముద్ర జలాల్లో సబ్ మెరైన్ కోసం వెతుకులాట సాగుతూనే ఉంది. అందులో 53 మంది ఉన్నారు. వారి గురించే మేం ఆందోళన చెందుతున్నాం అని ఆయన తెలిపారు. ఈ సబ్ మెరైన్ 1978 సంవత్సరానికి చెందింది. జర్మనీ లో తయారైంది.

కాగా, సముద్రం అడుగుభాగంలో సంచరించే సబ్ మెరైన్ ల నుంచి సంకేతాలు రాకపోతే అది ప్రమాదంలో పడినట్టుగా భావిస్తారు. సముద్ర అంతర్భాగంలో చలించే సబ్ మెరైన్ ల ఆచూకీ సంకేతాల ద్వారానే తెలుస్తుంది. సబ్ మెరైన్ కనిపించకుండా పోయి ఆరురోజులు కావడంతో అది ఏదైనా ప్రమాదంలో పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా నీటి అడుగుభాగానికి చేరిపోతే.. సబ్ మెరైన్ ను గుర్చించడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే..ఇక అందులో ఉన్న సిబ్బంది తప్పించుకునే అవకాశం చాలా తక్కువే అని నిపుణులు చెప్తున్నారు.