Begin typing your search above and press return to search.

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య వేలతో ఆగదు 13 లక్షలకు చేరుతుందట!

By:  Tupaki Desk   |   3 April 2020 1:30 AM GMT
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య వేలతో ఆగదు 13 లక్షలకు చేరుతుందట!
X
ఇండియాలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుందని.. దాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలం అవుతుందంటూ ప్రముఖ మీడియా సంస్థ ది గార్డియన్‌ తన గ్రౌండ్‌ విశ్లేషణలో పేర్కొంది. ది గార్డియన్‌ చెబుతున్న కథనం ప్రస్తుతం జనాలను భయకంపితులను చేస్తోంది. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా వైరస్‌ ను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం సిద్దంగా లేదని కనీసం కరోనా వైరస్‌ నిర్థారించే కిట్‌ లు కూడా ఇండియాలో అధికంగా లేవు. ఇప్పటి వరకు కేవలం 50 వేల మందికి మాత్రమే కరోనా పరీక్షలను ఇండియాలో నిర్వహించారు.

ప్రస్తుతం పుణెలోని మై ల్యాబ్‌ సంస్థ మాత్రమే కరోనా టెస్టు కిట్‌ లను తయారు చేస్తోంది. ఆ ఒక్క సంస్థ తయారు చేసే కరోనా టెస్టు కిట్‌ లు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమాత్రం సరి పోవు. ఇక భారత్‌ లో కరోనా టెస్టుకు కేవలం 52 ల్యాబ్స్‌ కు మాత్రమే అనుమతించింది. దేశంలో ఉన్న జనాభాకు ఆ ల్యాబ్స్‌ సంఖ్యకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను వైరస్‌ వ్యాప్తి చెందుతున్న స్పీడ్‌ ను చూస్తుంటే మే నాటికి ఇండియాలో 13 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ ను ఎక్కువ మొతాదులో తయారు చేయాల్సిన అవసరం ఉందని ది గార్డియన్‌ కథనంలో పేర్కొన్నారు.

దిల్లీ నిజాముద్దీన్‌ సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. నిజాముద్దీన్‌ లో కరోనా వైరస్‌ అంటించుకున్న ముస్లీంలు దేశ వ్యాప్తంగా వెళ్లారు. ఇప్పటి వారు వారికి తెలియకుండానే కరోనా వ్యాప్తిని విపరీతంగా చేశారు. వారు దిల్లీ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే సమయంలో విమానాలు.. బస్సులు.. ర్లైలో ప్రయాణాలు చేసి ఉంటారు. ఆ సమయంలో మరెంత మందికి వైరస్‌ వ్యాప్తి చెంది ఉంటుందో అనే విషయాన్ని తల్చుకుంటేనే భయం వేస్తుంది.

దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల్లో ప్రస్తుతం నిజాముద్దీన్‌ కేసులే ఎక్కువ ఉన్నాయి. వారి నుండి కాంటాక్ట్‌ అయిన కేసులు కూడా నమోదు అవ్వడం ప్రారంభం అయ్యింది. వారం రోజుల్లో ఆ కేసులన్నీ కూడా బయటకు వస్తాయి. కాంటాక్ట్‌ కేసుల ద్వారా వ్యాప్తి చెందిన కేసులు ఏప్రిల్‌ మూడవ వారంకు వెళ్లడయ్యే అవకాశం ఉంది. ఇలా మొత్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి ఇండియాలో అత్యంత స్పీడ్‌ గా రాబోయే రెండు మూడు వారాల్లో ఉంటుందని ఆ సమయంలో కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుందనే ఆందోళనను సదరు కథనంలో పేర్కొనడం జరిగింది.

ప్రస్తుతం కేసుల సంఖ్య వేలల్లోనే కనిపిస్తున్నా రెండు మూడు వారాల్లోనే ఆ నెంబర్‌ లక్షల్లోకి వెళ్లినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అయితే మన వద్ద ఇప్పటికే వేలాది మంది కరోనా టెస్టుల కోసం క్యూలో ఉన్నారు. కరోనా టెస్టు కిట్‌ లు ఎక్కువగా లేని కారణంగా పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. ఈ సమయంలో పాజిటివ్‌ ల సంఖ్య మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని వైధ్యులు ఆందోళన చెందుతున్నారు.

ఇక కరోనా పేషంట్స్‌ కు చికిత్స అందించే వైధ్యులకు కూడా భద్రత లేకుండా పోయింది. వారు ఉపయోగించే మాస్క్‌ లు కాని.. వారు ధరించే సూట్‌ లు కాని కరోనా నిరోధకం కాదంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో ఆరోగ్యంకు కేటాయించే బడ్జెట్‌ ఇతర దేశాల ఆరోగ్య బడ్జెట్‌ తో పోల్చితే చాలా తక్కువ శాతం ఉంటుంది. మన దేశ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆరోగ్యంకు ఎక్కువ నిధులు కేటాయించక పోవడం ఇప్పుడు మనకు శాపంగా మారింది.

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పుడు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా కూడా పరిస్థితులను అదుపులోకి తీసుకు రావడం సాధ్యం అయ్యే విషయం కాదని దీనికి చాలా మూల్యం చెల్లించాల్సి రావచ్చు అంటూ జాతీయ మీడియాల్లో ఆందోళనకర కథనాలు వస్తున్నాయి. మొత్తానికి కరోనా కేసులు వేలు దాటి లక్షలు చేరడం అయితే ఖాయం అని.. ఈ రెండు నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటూ ప్రచారం చేస్తున్నారు.