Begin typing your search above and press return to search.

అమెరికా వద్దు.. బ్రిటన్ ముద్దు..: ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   15 Aug 2022 5:34 AM GMT
అమెరికా వద్దు.. బ్రిటన్ ముద్దు..: ఎందుకంటే..?
X
విదేశాలకు వెళ్లి చదువుకోవాలన అనుకునేవారు మొదటగా చూజ్ చేసుకునే కంట్రీ ఎదంటే అమెరికా అని ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే ఇండియాకు, అమెరికాకు మధ్య ఉన్న సంబంధాల నేపథ్యంలో ఎక్కవ శాతం యూఎస్ కు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది.

అమెరికా వద్దు.. బ్రిటన్ ముద్దు అంటున్నారు. చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి మొన్నటి వరకు అమెరికా బాట పట్టిన వాళ్లు ఇప్పుడు ఇంగ్లండ్ వైపు వెళ్తున్నారు. దశాబ్ద కాలంలో లండన్ వెళ్లిన వారి సంఖ్యం కేవలం 20 వేల మంది ఉంటే.. ఒక్క 2021 సంవత్సరంలోనే లక్ష మంది వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారట. అయితే అమెరికాను కాదని బ్రిటన్ వైపు వెళ్లడానికి కారణం లేకపోలేదు. అదేంటో చూద్దాం..

ఉన్నత చదవులు, విదేశాల్లో సెటిల్ కావడానికి ఈరోజుల్లో పెద్ద విషయం కాదు. కానీ ఆ దేశంలో భారత్ కు ఉన్న సంబంధాలతో రాకపోకలు ఎక్కువవుతుంటాయి. అంతకుముందు అమెరికా, ఇండియా మధ్య అనేక ఒప్పందాలు ఉండేవి. భారతీయ నైపుణ్యాన్ని యూఎస్ సాదరంగా ఆహ్వానించింది.

అంతేకాకుండా అక్కడే సెటిల్ కావడానికి అనేక అవకాశాలిచ్చింది. ఇప్పుడు చాలా మంది అమెరికాలో తెలుగువాళ్లు విస్తరించారు.అక్కడి వైస్ ప్రెసిడెంట్ కమలహారిస్ భారత సంతతికి చెందిన మహిళ కావడం విశేషం. అయితే రాను రాను వీసాలపై అమెరికా కొత్త ఆంక్షలను విధిస్తోంది. విదేశీయుల ప్రాబల్యం పెరిగిపోవడంతో యూఎస్ లో నిరుద్యోగం పెరిగిపోతుందన్న ఆరోపణలపై వీసాల కఠిన ఆంక్షలు విధించారు. ఈ కష్టాల నడుమ అమెరికాకు వెళ్లడం మానుకుంటున్నారు.

ఇదే సమయంలో భారత్, ఇంగ్లండ్ ల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. తాజా ఒప్పందం ప్రకారం.. బ్రిటన్ లో చదువుకున్న వారు భారత్ లోఉద్యోగం చేయొచ్చు. అలాగా భారత్ లో చదువుకున్న వారికి బ్రిటన్ లో ఉద్యోగాలు లభిస్తాయి. దీంతో చదువుకోవడానికి, జాబ్ చేయడానికి ఇప్పుడు బ్రిటన్ బాట పడుతున్నారు. గత పదేళ్ల కాలంలో లండన్ వెళ్లిన వారి సంఖ్య 20 వేల మంది మాత్రమే ఉన్నారు. కానీ 2021లో లక్ష వరకు బ్రిటన్ కోసం దరఖాస్తు చేసుకున్నారట. అంటే వీరికి వీసాలు ఓకే అయితే బ్రిటన్ వెళ్లే అవకాశం ఉంది.

ఇక యూకే జారీ చేస్తున్న స్కిల్డ్ వర్క్ వీసాలో 44 శాతం ఇండియాకు అనుమతించారు. అంతకుముందు బ్రిటన్ లో చైనా వాళ్లు ఎక్కువగా ఉండేవారు. ఇక్కడి విద్యార్థుల్లో చాలా మంది వాళ్లే ఉండేవారు. కానీ ఇప్పుడు భారతీయ విద్యార్థుల హవా సాగతనుంది. ఇదేకాక ఒకప్పుడు ఇక్కడ చదువుకోసం వెళ్లి అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడిపోయేవారు. కానీ ఇప్పుడు భారత్, ఇంగ్లండ్ ల మధ్య జరిగిన ఒప్పందం కారణంగా రాకపోకలు సాగించవచ్చు. దీంతో ఈ దేశానికి వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.