Begin typing your search above and press return to search.

రాత్రంతా ఒకే గదిలో..యూనివర్సిటీలో లవర్స్ బాగోతం

By:  Tupaki Desk   |   23 Feb 2020 1:30 AM GMT
రాత్రంతా ఒకే గదిలో..యూనివర్సిటీలో లవర్స్ బాగోతం
X
ఓ ఇంజనీరింగ్ విద్యార్థి సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి రాత్రంతా తన ప్రేయసి అయిన తోటి విద్యార్థిని గదిలో గడిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 14నుంచి మూడురోజులపాటు నూజివీడులోని త్రిపుల్ ఐటీలో టెక్ జెన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు రోజున రాత్రి 12గంటల సమయంలో ఓ మగ విద్యార్థి అందరికీ కళ్లుగప్పి తోటి లేడీ విద్యార్థిని ఉండే వసతిగృహంలోకి ప్రవేశించాడు. విద్యార్థిని ఉండే కే-3 బ్లాక్ లోకి వెళ్లి తానుంటున్న గది కిటికి ఇనుప చువ్వలను వంచి లోపలికి వెళ్లాడు. రాత్రంతా అక్కడి గడిపినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన యూనివర్సిటీలోని సెక్యూరిటీ పనితీరు అద్ధం పడుతోంది.

ఈనెల 16న ఆ అబ్బాయి గదిలోకి ప్రవేశించాడు. రాత్రంతా అక్కడే గడుపగా తెల్లవారేసరికి సదరు విద్యార్థిని స్నేహితులు వారి గదికి తాళంవేసి వెళ్లారు. ఈ విషయం ఆ నోటా ఈనోటా బయటికి పొక్కడంతో సెక్యూరిటీ సిబ్బంది అలర్టయి చివరికు వారిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకొని యూనివర్సిటీ అధికారులకు అప్పగించారు.

ఇదంతా విద్యార్థులు పరస్పరం సహకరించుకోవడం వల్లనే జరిగిందని గ్రహించిన అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించి పంపారు. ఇంకోసారి ఇలాంటివి జరిగితే టీసీ ఇచ్చి పంపుతామంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే నూజివీడు త్రిపుల్ ఐటీలో గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం విశాఖపట్నంకు చెందిన ఓ వ్యక్తి క్యాంపస్ లోకి ప్రవేశించి వారంపాటు తిష్ఠ వేశారు. అనంతరం గుర్తించిన సిబ్బంది అతడిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. అయితే కోట్లు ఖర్చు చేసే యూనివర్సిటీ సెక్యూరిటీపై దృష్టిపెట్టకపోవడంతో ఫలితం శూన్యంగా కన్పిస్తోంది. తరుచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే త్రిపుల్ ఐటీ ప్రతిష్ఠ దిగజారుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారో లేదో చూడాల్సిందే..