Begin typing your search above and press return to search.

నిలిచిపోయిన జియో సేవ‌లు

By:  Tupaki Desk   |   29 Nov 2022 9:02 AM GMT
నిలిచిపోయిన జియో సేవ‌లు
X
దేశ వ్యాప్తంగా రిల‌య‌న్స్‌కు చెందిన జియో నెట్ వ‌ర్క్ సేవ‌లు నిలిచిపోయాయి. జియె నెట్ వ‌ర్క్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. కొంత‌మంది యూజ‌ర్లు సోమ‌వారం నుంచే ఈ సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు. మంగ‌ళ‌వారం దేశ వ్యాప్తంగా జియో సేవ‌లు నిలిచిపోవ‌డంతో దాని యూజ‌ర్ల అవ‌స్థ‌లు ప‌డ్డారు.

దాంతో జియె నెట్ వ‌ర్క్ యూజ‌ర్లు త‌మ ఇబ్బందుల‌ను సోష‌ల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జియె నెట్ వ‌ర్క్ నుంచీ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు చేసుకోవావ‌డానికి నెట్‌వ‌ర్క్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో యూజ‌ర్లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇంట‌ర్నెట్ బ్రౌజింగ్ లోనూ సమస్యలు ఉన్నట్టు యూజర్లు చెబెఉతున్నారు.

జియో నెట్ వ‌ర్క్‌లో ఈ ఉద‌యం నుంచీ ''వోల్టే'' సింబ‌ల్ క‌నిపించ‌డం లేదు. ''వోల్టే సింబల్ ఉదయం నుంచి కనిపించడం లేదు. దీంతో కాల్స్ చేసుకోలేని పరిస్థితి ఉంది. సాధారణ కాల్స్ కే సమస్యలు ఎదురవుతున్నప్పుడు 5జీ సేవలను అందించేందుకు మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటూ సోష‌ల్ మీడియాలో ఓ యూజ‌ర్ ప్ర‌శ్నించారు. మ‌రికొంత‌మంది యూజ‌ర్లైతే బ్రౌజింగ్‌లోనూ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని ఆరోపించారు. దేశ‌వ్యాప్తంగా ఉద‌యం 6 గంట‌ల నుంచీ 10 గంట‌ల వ‌ర‌కు జియో నెట్ వ‌ర్క్ లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదురైన‌ట్లు తెలుస్తోంది.

మొబైల్ నెట్ వర్క్ లో సమస్యలను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ పోర్టల్ చెబుతున్న దాని ప్రకారం.. 37 శాతం మంది యూజర్లు తమకు సిగ్నల్ రావడం లేదంటున్నారు. 37 శాతం మంది కాల్స్, ఎస్ఎంఎస్ లు చేసుకోలేకపోతున్నట్టు, 26 శాతం మంది యూజర్లు మొబైల్ ఇంటర్నెట్ లోనూ సమస్యలు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రధానంగా ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా పట్టణాల నుంచి యూజర్లు ఈ సమస్యలను ఎత్తి చూపుతున్నారు.

ఇలా ఉండ‌గా అవుట్ గోయింగ్ స‌దుపాయం లేని ఈ స‌మ‌యంలో సాధార‌ణ రోజుల‌కంటే కూడా ఇంట‌ర్నెట్ బాగా ప‌నిచేస్తోంద‌ని యూజ‌ర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఈ సంకేతిక అవ‌రోధాన్ని స‌రి చేసి నెట్ వ‌ర్క్ మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి తెచ్చేందుకు జియో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు.

అయితే జియో నెట్ వ‌ర్క్‌లో ఏర్ప‌డిన ఈ అంత‌రాయం గురించి జియో నుంచీ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న విడుదల కాలేదు. ఈ సాంకేతిక అంత‌రాయానికి కార‌ణాలేమిటీ అనేది తెలియ‌లేదు. ఈ ఏడాది అక్టోబ‌రు, జూన్, ఫిబ్ర‌వ‌రి మాసాల్లో కూడా ఇలా జియో సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.