Begin typing your search above and press return to search.

ఆ ఒక్కరోజు సోషల్ మీడియా కి దూరంగా ఉండండి

By:  Tupaki Desk   |   25 Sep 2021 11:30 PM GMT
ఆ ఒక్కరోజు సోషల్ మీడియా కి దూరంగా ఉండండి
X
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నుంచి ఒక్కరోజు లాగవుట్ చేసి నిరసన తెలుపాలని కోరుతున్నారు. ఫేస్ బుక్ లో పలు మార్పులు చేయాలని కోరుతూనే, ఎఫ్బీ సీఈవో పదవి నుంచి జూకర్ బర్గ్ ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2021 నవంబర్ 10న ఒక్కరోజు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నుంచి లాగవుట్ అయి వాటికి దూరంగా ఉండాలని సోషల్ జస్టిస్, అంతర్జాతీయ పౌర హక్కుల సంఘాలు ఫేస్ బుక్ యూజర్లను కోరుతున్నాయి.

అమెరికా వేదికగా ఇచ్చిన పిలుపును అందరూ పాటించాలని, అలా చేస్తేనే సోషల్ మీడియాలో సంస్కరణలు జరుగుతాయని భావిస్తుననాయి సదరు సంంఘాలు. 2018లో కేంబ్రిడ్జి అనలిటికా స్కాండల్ వెలుగు చూడటంతో సోషల్ మీడియాలో డిలీట్ ఫేస్ బుక్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ నడిచింది. అయితే దీని ప్రభావం ఫేస్ బుక్ మీద పడకపోయినా, కంపెనీ స్టాక్ ప్రైస్ మాత్రం ఘోరంగా దెబ్బతిన్నాయి. మళ్లీ పుంజుకోవడానికి ఫేస్ బుక్ కి చాలా టైమ్ వచ్చింది. ఈ ఏడాది నవంబర్‌ 10న మరోసారి ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ లను లాగ్‌ అవుట్‌ చేయాలని అంతర్జాతీయ పౌరహక్కుల సంఘాలు కోరుతున్నాయి.

ఇంటర్నెట్‌ లో ఫేస్‌ బుక్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల యూజర్ల వ్యక్తిగత డేటా చోరీకి గురవుతుందని పౌరహక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. కాపిటోల్‌ దాడి ఘటనతో పాటు మరికొన్ని దేశాల్లో జరిగిన ప్రజా వ్యతిరేక అంశాలను పరిగణనలోకి తీసుకుని కైరోస్‌ అనే సంస్థ ఈ క్యాంపెయిన్‌ ను మొదలుపెట్టింది. ఈ నెల 22 నుంచి ఫేస్ బుక్ కి వ్యతిరేకంగా మొదలైన ఈ క్యాంపెయిన్ ఫేస్ బుక్ వేదికగా రోజురోజుకు పుంజుకుంటోంది. సెన్సేషనలిజం కోసం పాకులాడుతూ.. వైషమ్యాలను రెచ్చగొడుతున్న కారణంగా ఫేస్ బుక్ ని కంట్రోల్ చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అందుకే నవంబర్‌ 10న.. 24 గంటలపాటు ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ ను లాగవుట్‌ చేయాలని పలు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే.. ఫేస్‌ బుక్‌ కి వచ్చే సంపాదనలో 98.5 శాతం యాడ్స్‌ ద్వారానే వస్తున్నాయి. అందునా యూజర్లకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో, సెర్చింగ్‌ డేటా ద్వారా ఆధారంగా నిఘా వేసి, సోషల్‌ మీడియాలో యాడ్స్‌ రూపంలో ప్రదర్శించి యూజర్ల జేబులు గుల్ల చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. సంచలనాల కోసం వైషమ్యాలని రెచ్చగొట్టడమే కాక ,జాతి విద్వేష పూరిత కంటెంట్ ను పేస్ బుక్ ప్రోత్సహిస్తుందని అన్నారు.