Begin typing your search above and press return to search.

జగన్ వ్యూహం ఇదేనా ?

By:  Tupaki Desk   |   23 Nov 2021 8:30 AM GMT
జగన్ వ్యూహం ఇదేనా ?
X
మూడు రాజధానుల బిల్లును కొత్తగా చట్టసభల్లోకి తీసుకొస్తామని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన చాలా ఆసక్తిగా కనబడుతోంది. ఇందులో భాగంగానే మొన్నటివరకు అమలులో ఉన్న మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.

ఇదే విషయాన్ని అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. సరే ఈ విషయాన్ని వదిలేస్తే ప్రభుత్వం కొత్తగా మూడు రాజధానుల బిల్లును తయారు చేయబోతున్నట్లు జగన్ చెప్పటం చంద్రబాబునాయుడు అండ్ కో కు మిగుండుపడని విషయమే.

జగన్ ప్రకటన వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉన్నట్లు సమాచారం. తొందరలో ప్రభుత్వం తయారుచేయబోయే బిల్లుల స్వరూప, స్వభావాల గురించి ఎవరికీ ఎలాంటి సమాచారం కూడా లేదు. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం తొందరలోనే జగన్ పెద్ద వ్యూహంతో అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఆ వ్యూహం ఏమిటంటే గ్రామస్ధాయి నుండి అసెంబ్లీ వరకు ప్రజా ప్రతినిధుల ఆమోదాన్ని రాతమూలకంగా తీసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారట.

మూడు రాజధానులకు ప్రజల ఆమోదం ఉందని చాటేందుకు పంచాయితీల్లో మొదటగా తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోవాలని అనుకున్నారట.

ఇదే విధంగా మండలస్ధాయిలో ఎంపీటీసీలు, జిల్లా స్ధాయిలో జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటిలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మూడు రాజధానుల ప్రతిపాదనలను ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోబోతున్నట్లు సమాచారం. అంతిమంగా ఇలాంటి తీర్మానాలనే అసెంబ్లీ, శాసనమండలిలోను ప్రవేశపెట్టి తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోబోతున్నారు. మొన్నటివరకు కౌన్సిల్లో ఉన్న ఇబ్బందులు కూడా ఇకముందుండదు.

అంటే జగన్ వ్యూహం ఏమిటంటే పంచాయితీ నుండి అసెంబ్లీ, కౌన్సిల్ వరకు మూడు రాజధానులకు ఆమోదం ఉందని చెప్పటమే. రేపు ఇదే విషయమై కోర్టుల్లో ఎవరైనా కేసులు వేసినా చట్టసభల ఆమోదం ఉందని లీగల్ గా కేసులను ఎదుర్కోవటమే జగన్ ఉద్దేశ్యం. మూడు రాజధానుల విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటున్న లీగల్ సమస్యలను కొత్త బిల్లు విషయంలో రాకుండా చూసుకోవటమే అసలైన వ్యూహం.

ఒకవేళ ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా కేసులు వేసినా అవేవీ మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకునే అవకాశం ఇవ్వకూడదని జగన్ ప్లాన్ వేస్తున్నారు. ఇవన్నీ అయ్యేందుకు కనీసం ఆరుమాసాల నుండి ఏడాదిపాటు పట్టే అవకాశం ఉంది. ఏడాది కాలం పట్టినా పర్వాలేదు కానీ వ్యవహారం మాత్రం ఈసారి పక్కాగా ఉండాలని జగన్ భావిస్తున్నారు. మరి జగన్ తాజా వ్యూహం ఏ విధంగా వర్కవుటవుతుందో చూడాల్సిందే.