Begin typing your search above and press return to search.

వివాహేతర సంబంధాల వల్లే హత్యలు.. రెండోస్థానం

By:  Tupaki Desk   |   26 May 2020 6:30 AM GMT
వివాహేతర సంబంధాల వల్లే హత్యలు.. రెండోస్థానం
X
హత్యలు.. అత్యాచారాలు, దాడులు.. ఇలా ఏదైనా చేయడానికి ఒక కారణం ఉంటుంది. దాని వెనక పగ ప్రతీకారాలుంటాయి. అయితే ఇన్నాళ్లు కక్షలు కార్పణ్యాలతోనే హత్యలు జరిగేవి. కానీ ఇప్పుడు సమాజం తీరు మారింది. బంధాలు, అనుబంధాలు చెడడం వల్లే దాదాపు సగం హత్యలు జరుగుతున్నాయి. తాజాగా నివేదికలో అదే విషయం వెలుగుచూసింది..

వరంగల్ లోని బావిలో శవమై తేలిన 10 మృతదేహాల గుట్టు వీడింది. ఒక ఆమెతో పెట్టుకున్న ఎఫైర్ వల్లే ఈ 10 హత్యలు జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకోమ్మంటే పార్టనర్ ను చంపేశాడు. తనను వారి కుటుంబ సభ్యులు చంపుతారని మిగతా అందరినీ నిద్రమాత్రలు మింగించి చంపేశాడు. అంతే ఈ 10 హత్యలు చేయడం వెనుక ప్రధాన కారణ వివాహేతర సంబంధం.. ఒకే వ్యక్తి.. ఒకే కారణం ఇంతటి ఉపద్రవానికి కారణమైంది. వివాహేతర సంబంధాలను కప్పిపుచ్చుకునేందుకు మొదలైన ఈ హత్యల పరంపర అందరినీ కడతేర్చే వరకు సాగింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా జాతీయ నేరాల నమోదు సంస్థ ఎన్.సీ.ఆర్.బీ లెక్కల ప్రకారం హత్యలు, గణాంకాలు ఆరాతీస్తే తెలంగాణలో షాకింగ్ విషయాలు బయట పడ్డాయి.

కుటుంబ కలహాల కారణంగా అత్యధికంగా తెలంగాణలో 20.6శాతం హత్యలు జరిగాయి. ఇక ఆ తర్వాత స్థానం వివాహేతర సంబంధాలదే.. ఎఫైర్ల కారణంగా 11.45శాతం హత్యలు చోటుచేసుకున్నాయి. తర్వాత వరకట్నం కారణంగా 5.97శాతం, ఆస్తి వివాదాలతో 11.45శాతం హత్యలు చోటుచేసుకుంటున్నాయి. అంటే బంధాలు, అనుబంధాల కారణంగానే దాదాపు సగం హత్యలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.